వివాహంలో గౌరీ పూజ ఎందుకు చేస్తారో తెలుసా..!?

-

మనం ఏ శుభకార్యం చేసిన మొదటగా వినాయకుడికి పూజ చేస్తాము. ఇక పెళ్లిళ్లలో అయితే గౌరీ పూజ ప్రధాన క్రతువుగా చెప్పబడింది. అసలు గౌరీ పూజను ఎందుకు చేస్తారు. దాని ప్రాముఖ్యత ఏంటిది అనేది చాల మందికి తెలీదు. గౌరీ పూజ విశిష్టత గురించి తెలుసుకుందాం..!

gowri vratham

పురాణాల ప్రకారం.. నల్లని ఛాయతో ఉన్న పార్వతీ దేవిని పరమేశ్వరుడు కాళి అని పరిహాసం చేస్తాడు. ఆ పరిహాసానికి ఆత్మాభిమానం దెబ్బతిన్న పార్వతి దేవి, స్వామి వారిని విడిచి పెట్టి , భూలోకానికి వస్తుంది. ఆమె భూలోకంలో తపస్సు చేసి, తన రంగును మార్చుకుని, శివుడిని మెప్పించింది. అదేవిధంగా పార్వతీదేవి మాంగల్యబలం చాలా శక్తివంతమైనది. తన మాంగల్యబలం మీదున్న నమ్మకంతో తన భర్త క్షీరసాగర మథనంలో పుట్టిన కాలకూట విషాన్ని ఉండగా చేసుకుని, మింగేస్తాను అని అన్న కూడా పార్వతి దేవి ఆపలేదు.

ఇక విషాన్ని మింగిన ఈశ్వరుడు నీలకంఠుడు, గరళకంఠుడు, విషకంఠుడు, అయ్యారు తప్ప ఆయనకు ఏమీ కాలేదు. అంతటి మాంగల్యబలం పొందాలనే వివాహానికి ముందు పెళ్లి కూతురు చేత గౌరీ పూజ చేయిస్తారు. కాబోయే దంపతులు ఆది దంపతులైన గౌరీశంకరు ల ఆశీర్వాదాలతో ఆదర్శ దంపతులుగా నిలిచి ఉండాలన్న కోరికతో పెళ్లి తంతుల్లో గౌరీపూజకి ప్రత్యేక స్థానం కల్పించారు.

అంతేకాదు గౌరీ దేవిని మాంగల్యానికి ఆది దేవతగా భావిస్తారు. వివాహానికి ముందే ఈ దేవతను పెళ్లికూతురితో పూజింప చేస్తారు. భవిష్యత్‌లో భాగస్వామికి ఎలాంటి సమస్యలు, గండాలు వచ్చినా అవి అతడిని ఏం చేయకుండా ఉండాలని పరిపూర్ణమైన సౌభాగ్యం వధువుకి జీవితాంతం తోడుండాలనే మంచి సంకల్పంతో గౌరీ పూజ చేయిస్తారు. గౌరీ పూజ సమయంలో వధువు తల్లిదండ్రులు పక్కనే ఉండి ఈ తంతును చేయిస్తారు. తన భర్తకి రక్షణ కోరుతూ, మాంగల్యం, పసుపుకుంకుమలతో నిండు నూరేళ్లు పచ్చగా ఉండాలని కోరుకుంటూ పూజ చేయడమే గౌరీ పూజ యొక్క పరమార్ధం.

Read more RELATED
Recommended to you

Exit mobile version