టీ పీసీసీ చీఫ్ పదవి కోసం సీనియర్ల కొత్త లాబీయింగ్

-

తెలంగాణ కాంగ్రెస్ లో ఇప్పుడు అంతా కొత్త పీసీసీ చీఫ్ ఎవరన్న దానిపై చర్చ జరుగుతోంది. అయితే ఎవరికి వారు తమ ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఢిల్లీ లాబీయింగ్ ఒక ఎత్తయితే… హైదరాబాద్ లో పార్టీ సీనియర్లు అంతా ఇంకో లాబీయింగ్ నడిపిస్తున్నారు….

తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వం అంతా… ఇప్పుడు కొత్త పీసీసీ న ఈ ఎంచుకునే పనిలో పడ్డారు. చాలా కాలంగా పీసీసీ మార్పు అంశం చర్చలో ఉన్నా.. ఇటీవల ఉత్తమ్ రాజీనామా ను ఆమోదించి… కొత్త పీసీసీ నియామకానికి కసరత్తు ప్రారంభించాలని ఏఐసీసీ ని కోరారు. దింతో త్వరలోనే హైదరాబాద్ కి ఏఐసీసీ ఇంఛార్జి ఠాగూర్ రాబోతున్నారు. అందరి అభిప్రాయ సేకరణ కూడా చేయబోతున్నట్టు సమాచారం. ఇంతలో తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఎవరికి వారు ప్రయత్నాలు మొదలుపెట్టారు.

తెలంగాణ కాంగ్రెస్ లో ప్రధానంగా … ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి… రేవంత్ రెడ్డి పేర్ల చుట్టూ పీసీసీ అంశం తిరుగుతుంది. అయితే…పార్టీలో సీనియర్లు అంతా రేవంత్ కి వ్యతిరేకంగా ఓ జట్టు కట్టారు. అవసరం అయితే త్వరలోనే ఢిల్లీకి కూడా వెళ్లాలని ఆలోచన చేస్తున్నారు. ఒకటి రెండు రోజులుగా సీఎల్పీ నేత భట్టి… మధు యాష్కీ..పొన్నాల లక్ష్మయ్య లాంటి నాయకులు హైదరాబాద్ లో మంతనాలు చేస్తున్నారు. పార్టీ ని గట్టేంకిచటం ఎలా అనే అంశాలపై చర్చలు జరుపుతున్నారు. పార్టీలో సీనియర్ నాయకులంతా ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కి మద్దతు పలకడానికి సిద్దమయ్యారు.

అయితే సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కి సన్నిహితుడైన శ్రీధర్ బాబు ని పీసీసీ చేయాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రస్తుత పరిస్థితిలో… శ్రీధర్ బాబు కి అవకాశం లేకుంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కి అవకాశం ఇవ్వాలనే ప్రతిపాదన లో ఉన్నట్టు సమాచారం. పార్టీ అభిప్రాయ సేకరణ మొదలుపెడితే అందరూ ఏకాభిప్రాయం గా ఉండాలనే ఆలోచనకు మాత్రం వచ్చారు. జగ్గారెడ్డి కూడా తన పేరు పరిశీలన చేయాలని కోరుతున్నారు. త్వరలోనే ఢిల్లీ కి వెళ్లి పార్టీ ముఖ్యులను కలవాలని ప్రయత్నిస్తున్నారు. అయితే అవకాశం ఉంటే వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి అయినా… తీసుకోవడానికి జగ్గారెడ్డి సుముకంగా ఉన్నట్టు తెలుస్తోంది.

పార్టీలోకి కొత్తగా వచ్చిన వారి కంటే… మొదటి నుండి ఇక్కడే ఉండి కమిటెడ్ గా పని చేసిన వారికి పీసీసీ ఇవ్వాలన్నది ప్రధాన అంశంగా మారబోతుంది. పార్టీలో బీసీ సామాజిక వర్గం నాయకులు మాత్రం… పీసీసీ అవకాశం బీసీ లకే ఇవ్వాలని డిమాండ్ మొదలుపెట్టారు. ఎవరికి ఇవ్వాలన్న దానికంటే… బీసీ లకు మాత్రం అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు పీసీసీ ఎంపిక ప్రక్రియ ఈ నెల 9 తర్వాత ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇంతలో తెలంగాణలో ఎవరికి వారు తమ పావులు కదుపుతున్నారు.

ఏఐసీసీ మనసులో ఏముంది.. స్థానిక నాయకుల ఆలోచన కు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటారా.. అనేదిచూడాలి. ఎప్పటి లాగానే సీల్డ్ కవర్ లో పీసీసీ పేరు వస్తుందో… లేదో మరి

Read more RELATED
Recommended to you

Exit mobile version