రెప్పలు వేయడం ఆపేస్తున్నారా.? మరీ అలా చూస్తే కళ్లు దెబ్బతింటాయ్‌..!

-

ఈ రోజుల్లో చిన్నపిల్లల నుంచి పెద్దల వరకూ అందరికీ..స్క్రీన్‌ టైమ్‌ ఎక్కువైపోతుంది. ఎవరి అవసరాలకు తగ్గట్టు వాళ్లు స్క్రీన్‌ చూసేస్తున్నారు. ఇంకా సీరియస్‌గా వర్క్‌ చేసేప్పుడో, హర్రర్‌ మూవీస్‌ లేదా ఏదైనా ఇంట్రస్టింగ్‌ సీన్‌ చూసేప్పుడో కళ్లు రెప్ప కూడా వేయకుండా అలానే చూస్తాం. అసలు ఆ టైమ్‌లో రెప్ప వేయాలనే ఆలోచన కూడా రాదు. నిజానికి కళ్లు రెప్పలు వేయడం అనేది మనకు తెలియకుండానే నిరంతరం జరిగే ప్రక్రియ. మనం చేసే కొన్ని పనుల వల్ల అది ఆగిపోతుంది. అలా జరిగింది అని కూడా మనకు తెలియదు. ఇలా కళ్లు రెప్పవేయకపోవడం వల్ల చాలా సమస్యలు వస్తాయట.

నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం.. క్రమం తప్పకుండా రెప్పలు వేయడం ఆరోగ్యానికి చాలా మంచిది. ముఖ్యంగా కళ్లు త్వరగా వృద్ధాప్యానికి గురికాకుండా ఉండేందుకు ఇది సహాయపడుతుంది. వయస్సు పెరిగేకొద్ది కళ్ల వ్యాధులు కూడా పెరుగుతాయి. గ్లాకోమా, కంటి శుక్లం వంటి సమస్యలు ఏర్పడతాయి. కంటి రెప్పలను వేయడం వల్ల చిన్న చిన్న మలినాల నుంచి రక్షణ లభిస్తుంది. కళ్లను హైడ్రేటెడ్‌గా ఉంచాలంటే తప్పకుండా రెప్ప వేయాల్సిందే.

పొడి కళ్లు, కంటి అలసట, అస్పష్టమైన దృష్టిని నివారించడానికి కంటి రెప్పలు వేయడం తప్పనిసరి. వీలైతే రెప్పల వ్యాయామం చేయాలని డాక్టర్లు అంటున్నారు. ఇందుకు మీరు రెండు కళ్లను రెండు సెకన్లపాటు మూయండి, మళ్లీ తెరవండి. ఇలా రోజులో కొన్నిసార్లు చేస్తుంటే తప్పకుండా మీ కళ్లు రిలాక్స్‌గా ఉంటాయి. దృష్టి సమస్యలు కూడా రావు. అంతేగాక మీరు ల్యాప్‌టాప్, మొబైల్ లేదా టీవీలను అలా చూస్తుండిపోకుండా.. స్క్రీన్ బ్రేక్ తీసుకోవాలి. 20-20-20 రూల్ పాటించండి. అంటే 20 నిమిషాలకు ఒకసారి 20 అడుగుల దూరంలో ఉన్నవాటిని 20 సెకండ్ల పాటు చూడండి.
దీని వల్ల మీ కళ్లకు కాస్త విశ్రాంతి లభిస్తుంది. అతి వెలుతురు నుంచి కళ్లను కాపాడేందుకు ‘పోలరైజ్డ్ సన్ గ్లాసెస్’ ధరించాలి. యవ్వనంలో ఉన్నప్పుడే ఇలాంటి గ్లాసెస్ ధరించడం ద్వారా కళ్ల ఆయుష్సును పెంచవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version