అవును మీరు చదివింది నిజమే. అగ్ర రాజ్యమైన అమెరికాకి అధ్యక్షుడు అయినప్పటికీ వైట్ హౌస్ లో కిటికీ ఓపెన్ చేసుకోవడానికి లేదట. ప్రెసిడెంట్ నివాస స్థానమైన వైట్ హౌస్ లో అధ్యక్షుడికి అనేక నిబంధనలు ఉన్నాయి. అత్యంత పెద్దదైన ఆ భవనంలో 130 గదులు ఉంటాయట.
ఐతే అన్ని గదుల్లో ఉన్న పురాతన వస్తువులని ముట్టుకోవడానికి కూడా వీలు లేదట. ప్రెసిడెంట్ తన ఫ్యామిలీతో సహా, నివాసానికి వస్తే అక్కడ తమ తమ గదుల్లో ఇంటీరియర్ డిజైన్ తమకి నచ్చినట్టు చేసుకోవచ్చట. కానీ అక్కడ ఉన్న పెయింటింగ్స్ మాత్రం టచ్ చేయొద్దట.
వైట్ హౌస్ లో మొత్తం ఐదుమంది ఫుల్ టైమ్ ఛెఫ్ లు ఉంటారట. ఏది కావాలంటే అది వండిపెడతారు. కానీ దానికి అయ్యే బిల్లు మొత్తం ప్రెసిడెంట్ సాలరీలో నుండి కట్ చేస్తారట.
అంత పెద్ద ఇంటిలో కిటికీ తెరవడానికి పర్మిషన్ కూడా లేదట. భద్రత కారణాల వల్ల కిటికీ తెరుచుకునే అవకాశం లేదు.
ఒక్క ఫుడ్డే కాదు, అక్కడ ఏం చేయాలన్నా సాలరీలో నుండే కట్ అవుతాయట.ఒకసారి బారాక్ ఒబామా, అక్కడ ఉన్న ఛెఫ్ కి చేప కర్రీ బాగుందని అంటే, ఆ తర్వాతి రోజు కూడా అదే వండిపెట్టాడట. నెల తర్వాత ఆ చేప బిల్లు చూసి మిషెల్ ఒబామా షాక్ అయ్యిందట. ఒక్కో చేప 50వేల రూపాయలు అని రాసారట. అంతెందుకని అడిగితే ఆ చేపని జపాన్ నుండి తెప్పించామని చెప్పారట.
అదే కాదు వైట్ హౌస్ లో ఆత్మలు తిరుగుతుంటాయని అంటారట. రాత్రిపూట అక్కడ రకరకాల అరుపులు వినిపిస్తాయట.
ఈ విషయాలన్నీ పూరీ జగన్నాథ్ గారు తన పాడ్ కాస్ట్ ద్వారా తెలియజేసారు.