నిద్రలో మనకు కలలు రావడం సహజం. ఆరోజు జరిగిన సంఘటనలు, మన ఆలోచనలే కలలుగా వస్తాయి. అయితే కలలో దేవుళ్లు కనిపించటం అందరూ శుభప్రదం అనుకుంటారు. ఏ దేవుడు కనిపిస్తే.. ఏం జరుగుతుంది. ఏంటి దానికి సంకేతం అనేది కూడా ఉంటుందట. స్వప్న శాస్త్రం ప్రకారం ప్రతికలకు ఓ అర్థం, పరమార్థం ఉంది. ఈరోజు మనం కలలో ఏ దేవుడు కనిపిస్తే ఏం జరుగుతుందో చూద్దాం.

శివుడిని కలలో చూస్తే..

మీ కలలో శివుడిని చూసినట్లయితే, మీరు సమస్యల నుంచి అతి త్వరలో విముక్తి పొందనున్నట్లు అర్థమట..స్వప్నశాస్త్ర ప్రకారం.. శివుడు కలలోకి వచ్చాడంటే.. అన్ని ఇబ్బందులు తొలిగినట్లే. అంతేకాకుండా మీ కలలో శివలింగాన్ని చూసినట్లయితే, ఆ కల కూడా ఎంతో పవిత్రమైనదిగా పరిగణిస్తారు. మీ జీవితంలో పురోగతి, కీర్తిని పొందుతారని ఆ కలకు సంకేతం.
దుర్గామాత కోపంగా కనిపిస్తే..
మీ కలలో దుర్గామాతను కోపంగా చూసినట్లయితే, ఆ కల అశుభ పరిణామానికి సంకేతమట. అంటే ఆ తల్లి మీ పై కోపంగా ఉందని అర్థం. ఒకవేళ దుర్గామాత సింహంపై స్వారీ చేసినట్లు మీకు కలలో కనిపిస్తే.. మీ జీవితంలో సమస్యలు త్వరలోనే పరిష్కారం అవుతాయని సంకేతం.
రాముడిని కలలో చూస్తే..
మీరు కలలో రాముడిని చూస్తే.. చాలా మంచిదట.. మీ జీవితంలో పురోగతికి అవకాశాలు లభిస్తాయని సంకేతం.. అయితే అందుకు తగ్గట్టుగా.. మీ విధులను మీరు సక్రమంగా నిర్వర్తించాలని ఆ కల ద్వారా మీకు అందిన సంకేతం.
కలలో శ్రీకృష్ణుని దర్శనం..
మీకు కలలో శ్రీకృష్ణుడు కనిపిస్తే.. స్నేహం, లేదా మరేదైనా బంధం ద్వారా మీ జీవితంలో ప్రేమ చిగురిస్తుందని సంకేతమట.. ఒకవేళ మీరు ఎవరితోనైనా ప్రేమలో ఉంటే.. ఈ కల చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు.
కలలో విష్ణువు దర్శనం..
మీరు కలలో విష్ణువును చూసినట్లయితే, మీరు విజయం సాధిస్తారని.. జీవితంలో పురోగతిని పొందుతారని అర్థమట.
లక్ష్మీదేవి కలలో కనిపిస్తే..
మీ కలలో లక్ష్మీదేవి కమలంపై కూర్చున్నట్లు కనిపిస్తే, అది చాలా పవిత్రమైన కలగా స్వప్నశాస్త్రంలో పరిగణిస్తారు. ఈ కల సంపదకు చిహ్నం. కలలో లక్ష్మీమాతను చూస్తే.. మీకు డబ్బు త్వరలోనే లభిస్తుందని.. లాభాలను పొందుతారని అంటారు.
మొత్తానికి దేవుడు కలలోకి రావడం వల్ల శుభమే జరుగుతుంది. ఇంతకీ మీకు ఎప్పుడైనా దేవుడు కలలోకి వచ్చాడా..!
గమనిక: పై కథనానకి ఎలాంటి ఆధారాలు లేవు. పాఠకులు ఆస్తకిని దృష్టిలో పెట్టుకుని స్వప్నశాస్త్రం ప్రకారమే మీకు ఈ సమాచారం అందించబడింది.
-Triveni Buskarowthu