శ్రీకాకుళం జిల్లా టెక్కలి వద్ద నిర్వహించిన మేమంతా సిద్ధం సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… మోసగాడు కావాలా , నీతి పరుడు కావాలా అని శ్రీకాకుళం జిల్లా అక్కవరం ప్రజలను ముఖ్యమంత్రి జగన్ ప్రశ్నించారు. ఈ క్రమంలో ఆయన మాజీ సీఎం చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
చంద్రబాబుకు ఓటేస్తే తమ పథకాలన్నీ రద్దు అవుతాయన్నారు. సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి అందించిన చరిత్ర వైసీపీదని తెలిపారు. చంద్రబాబు పొత్తులు పెట్టుకుని దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు.. తనతో పోటీ పడటానికి చంద్రబాబుకు రెండు పార్టీలు కావాలని అన్నారు . 2014లో చంద్రబాబు కూటమి ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలు కాలేదని,జగన్ కు ఓటస్తే పథకాలన్నీ కొనసాగుతాయని హామీ ఇచ్చారు. నెరవేర్చలేని హామీలు మేనిఫెస్టోలో పెట్టబోనన్నారు వైఎస్ జగన్.