కరెంట్ మీటర్లు పెట్టే మోడీ కావాలా.. లేక కెసిఆర్ కావాలా? – కెసిఆర్

-

మునుగోడులో టిఆర్ఎస్ ప్రజా దీవెన సభ ప్రారంభమైంది. సభా వేదికపై పార్టీ జెండాను సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. వేదికపై అమరుల స్తూపానికి నివాళులు అర్పించారు. అనంతరం ప్రజా దీవెన సభలో మునుగోడు ప్రజలను ఉద్దేశించి సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. కేంద్రంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కరెంటు మీటర్లు పెట్టే మోడీ కావాలా.. లేక కేసీఆర్ కావాలా?ఎవరు కావాలో గ్రామాల్లో చర్చ జరగాలన్నారు సీఎం కేసీఆర్. రైతులు వ్యవసాయం మానేల కుట్ర జరుగుతుందన్నారు.

మోడీకి చెందిన బడాబాబులు సూట్ కేసులతో రెడీగా ఉన్నారని.. రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు సీఎం. నేను చెప్పే మాట నిజమా ,కాదా ఆలోచించుకోవాలన్నారు. రైతుబంధు, రైతు బీమా ఎంతమందికి వస్తుందో ఒక్కసారి ఆలోచించాలన్నారు. గతంలో రైతులు చనిపోతే కుటుంబం రోడ్డున పడేదని.. ఇప్పుడు రైతు చనిపోతే 10 రోజులలోపు 5 లక్షలు ఇస్తున్నామన్నారు. ఇలాంటి పథకం ఎక్కడా లేదన్నారు సీఎం కేసీఆర్. మునుగోడు లో జరిగేది ఉప ఎన్నిక కాదు.. మన బతుకుకి సంబంధించినది అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version