జనవరి నెల లో మీరు ఏదైనా మంచి ప్రదేశానికి వెళ్లాలని అనుకుంటున్నారా..? చక్కగా అందమైన ప్రదేశానికి వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారా..? అయితే కచ్చితంగా జనవరిలో ఈ ప్రదేశాలకు వెళ్ళండి. జనవరి నెలలో ఈ ప్రదేశాలని చూడడానికి అనుకూలంగా ఉంటుంది చాలా అందంగా ఇవి ఉంటాయి. కొండ ప్రాంతాలలో లోయలలో మీ సమయాన్ని గడిపితే మళ్లీ మీరు మిమ్మల్ని రీచార్జ్ చేసుకోవడానికి అవుతుంది మరి జనవరిలో చూడదగ్గ ప్రదేశాల గురించి ఇప్పుడు చూద్దాం.
జిభి
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఇది వుంది. ఇక్కడ ఆకర్షణీయమైన జలపాతాలు చాలా ఉన్నాయి. ప్రకృతి ప్రేమికులు కి ఇది చాలా బాగుంటుంది. ట్రెక్కింగ్, క్యాంపింగ్, నేచర్ వాకింగ్ కి అనుకూలంగా ఉంటుంది. 2 నుండి 3 రోజులు ఇక్కడ వెళ్లి రావడానికి ప్లాన్ చేసుకోండి.
లంబసింగి
ఆంధ్ర ప్రదేశ్‌లోని లంబసింగి చూసేందుకు ఇదే సరైన టైం. దట్టమైన పొగమంచుతో ఉంటుంది ఇది. ఈ ఆంధ్రా కాశ్మీర్ ని ఎంచక్కా జనవరిలో చూడచ్చు. వైల్డ్ లైఫ్ సఫారీ, ఫోటోగ్రఫీ, నేచర్ వాక్ ఇక్కడ చేసేయచ్చు. టీ , కాఫీ తోటలు కూడా ఉన్నాయి.
తవాంగ్
అడ్వెంచర్స్ కి ఇది బాగుంటుంది. అలానే ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద బౌద్ధ విహారమిది. జనవరి లో ఇక్కడ వెళ్లేందుకు బాగుంటుంది. ట్రెక్కింగ్ కి బాగుంటుంది. షాపింగ్ కూడ ఇక్కడ చేసేయచ్చు.
మెచుకా వ్యాలీ
అరుణాచల్ ప్రదేశ్‌లో ఇది వుంది. సముద్ర మట్టానికి సుమారు 6,000 అడుగుల ఎత్తులో ఇది వుంది.