శ్రీకాకుళం లోని కంపొస్ట్ కాలనీలో అర్బన్ పిహెచ్సీని ప్రారంబించారు మంత్రి ధర్మాన ప్రసాదరావు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైసిపి ప్రభుత్వంలో ప్రజలందరూ హాయిగా జీవించే ప్రోగ్రాంలు నడుస్తున్నాయన్నారు. చెప్పింది చేస్తున్నాం… కార్యక్రమం అమలుచేసి వస్తున్నాయా లేదా అంటూ గడప గడపకూ వచ్చి అడుగుతున్నాం అన్నారు. ప్రజలు ఒక్కసారి ఆలొచించాలని కోరారు.
ఈ ప్రభుత్వంలో పార్టీ వర్కర్స్ నష్టపోయారని అన్నారు. గడిచిన తొమ్మిది సంవత్సరాలుగా ప్రజల చాకరీ చేస్తున్నారని అన్నారు మంత్రి ధర్మాన. నయాపైసా ఆశించకుండా పార్టీ కార్యకర్తలు పనిచేసారని కొనియాడారు. వాలంటీర్లు అంతే స్దాయిలో నేడు పనిచేస్తున్నారని అన్నారు. సంక్షేమ పధకాలు సక్రమంగా వస్తున్నాయి , తాము అనందంగా ఉన్నామని ప్రజలు చెబుతున్నారని తెలిపారు. ఓ మహిళ ఓటు జగన్ బాబుకు వెస్తామంటుంది.. కానీ గుర్తు ఏంటంటని ప్రశ్నిస్తే మాత్రం సైకిల్ అని చెప్పిందన్నారు.
దీనికి కారణం వాలంటీర్ , సెక్రటేరియట్ సిబ్బంది , వైసిపి కార్యకర్తలది తప్పు అన్నారు. ఒక్క నయాపైసా లంచం తీసుకొకుండా నేడు కార్యక్రమాలు చెస్తున్నామని.. అదే బాబు ప్రభుత్వం అయితే అంతా లంచం ఇచ్చామని చెప్పేవారన్నారు. బాబు పాలనకు జగన్ పాలనకు తేడా గమణించాలాన్నారు ధర్మాన.