మాజీ MRO సుజాత మృతిని ధ్రువీకరించిన వైద్యులు

-

షేక్ పేట మాజీ ఎమ్మార్వో సుజాత అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. శుక్రవారం సాయంత్రం గుండెపోటుతో నిమ్స్ ఆసుపత్రిలో చేరిన సుజాత శనివారం ప్రాణాలు విడిచారు. సుజాత మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. నేడు మాజీ ఎంఆర్ఓ సుజాత మృతిని ధ్రువీకరించారు గాంధీ ఆసుపత్రి వైద్యులు. గతవారం క్రితం అనారోగ్యానికి గురి కావడంతో నిమ్స్ కు తీసుకువచ్చారు కుటుంబ సభ్యులు. మరోవైపు సుజాతకు క్యాన్సర్ కూడా ఉందని వైద్యులు అంటున్నారు.

అదే సమయంలో డెంగీ కూడా సోకడంతో ట్రీట్మెంట్ మొదలు పెట్టినట్లు చెబుతున్నారు. ట్రీట్మెంట్ కొనసాగుతూ ఉండగానే ఉదయం కార్డియాక్ అరెస్ట్ తో సుజాత మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం సుజాత మృతదేహం నిమ్స్ ఆసుపత్రిలోనే ఉంది. మరికాసేపట్లో సుజాత మృతదేహాన్ని చిక్కడపల్లికి తరలించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version