అవసరమైతేనే బయటకు రండి.. ఏలూరులో తేలని వింత వ్యాధి !

-

ఏలూరులో వింత వ్యాధి  కేసులు గంట గంటకూ పెరుగుతున్నాయి. రెండు రోజుల నుండి మొత్తం 150 కేసులు వచ్చినట్టు చెబుతున్నారు. ఇప్పటి దాకా 30 మంది డిశ్చార్జి అయ్యారు. ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో 100 పడకలు, ఆశ్రం ఆసుపత్రిలో 50 పడకలతో ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేశారు ప్రభుత్వ అధికారులు. ఆసుపత్రిలోనే రాత్రంతా ఉండి పరిస్థితిని డీసీహెచ్ డాక్టర్ ఏవిఆర్ మోహన్,  డీయం అండ్ హెచ్ ఓ డాక్టర్ సునంద సమీక్షిస్తున్నారు. 

బాధితులకు రక్త పరీక్షలు,  సిటీ స్కానింగ్ పరీక్షలు చేసినా ఎటువంటి వ్యాధి లక్షణాలు కనిపించలేదు. వారికి కరోనా పరీక్షలు కూడా చేసినట్టు చెబుతున్నారు. మంచినీరు లేదా వాయు కాలుష్యం కారణం కావచ్చని వైద్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మంచినీరు కాచి తాగాలని,  అవసరమైతేనే బయటకు రావాలని వైద్యుల సూచనలు చేస్తున్నారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు మంత్రి ఆళ్ళ నాని,  కలెక్టర్ ముత్యాలరాజు, సమీక్షిస్తున్నారు. ఏలూరు కార్పొరేషన్ కార్యాలయంలో కంట్రోల్ రూములు ఏర్పాటు చేశారు. దాని నెం 9154592617.

Read more RELATED
Recommended to you

Exit mobile version