అధిష్టానం నుండి పిలుపు.. ఢిల్లీకి బండి సంజయ్..

-

ఈ రోజు బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్రమంత్రి అమిత్ షాలను బండి సంజయ్ కలవనున్నట్టు చెబుతున్నారు. గ్రేటర్ ఎన్నికల ఫలితాల వివరాలను బీజేపీ జాతీయ నేతలకు బండి సంజయ్ వివరించే అవకాశం ఉంది.  హైద్రాబాద్ లో ప్రచారం నిర్వహించిన కేంద్రమంత్రులు, ప్రకాష్ జావడేకర్, స్ర్మతీ ఇరానీ సహా పలువును కలసి కృతజ్ఞతలు తెలిపే అవకాశం కూడా ఉందని అంటున్నారు.

bandi-sanjay

ఇక సోమవారం జేపీ నడ్డా సమక్షంలో విజయశాంతి బీజేపీలో చేరనునన్నట్టు చెబుతున్నారు. ఇక నేడు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌ వర్థంతి  కావడంతో 9.30 గంటలకు ట్యాంక్ బండ్ పై ఆయన విగ్రహానికి నివాళులర్పించనున్న బండి సంజయ్, 10 గంలకు బీజేపీ కార్యాలయంలో అంబేడ్కర్‌ వర్థంతి కార్యక్రమంలో పాల్గొననున్నారు అనంతరం ఆయన ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version