Fact Check: రేష‌న్ కార్డుదారుల‌కు రూ.50వేలు ఇవ్వ‌నున్న మోదీ.. నిజ‌మేనా..?

-

క‌రోనా లాక్‌డౌన్ కార‌ణంగా దేశంలో ఇబ్బందులు ప‌డుతున్న పేద‌లకు ఆహారం, రూ.1500 న‌గ‌దు అందించేందుకు కేంద్ర ప్ర‌భుత్వం గ‌తంలో రూ.1.70 ల‌క్ష‌ల కోట్ల‌తో ఆర్థిక ప్యాకేజీని ప్ర‌క‌టించిన విష‌యం విదితమే. ఇందులో భాగంగానే కేంద్రం క‌రోనా వ‌ల్ల తీవ్ర న‌ష్టాల్లో కూరుకుపోయిన రంగాల‌ను మ‌ళ్లీ గాడిలో పెట్టేందుకు కొత్త‌గా మ‌రో భారీ ఆర్థిక ప్యాకేజీని సిద్ధం చేస్తోంది. అంతేకాకుండా.. పేద‌, మ‌ధ్య త‌ర‌గ‌తి వర్గాల కోసం ప‌లు కొత్త ప‌థ‌కాల‌ను కూడా కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్ట‌నుంద‌ని సమాచారం. అయితే ఇటీవ‌లి కాలంలో రేష‌న్ కార్డులు ఉన్న‌వారికి ప్ర‌ధాని మోదీ రూ.50వేల‌ను అందిస్తారంటూ.. సోష‌ల్ మీడియాలో ఓ మెసేజ్ ఎక్కువ‌గా ప్ర‌చారం అవుతోంది. అయితే.. ఇందులో నిజ‌ముందా..? అస‌లు ఈ ప‌థ‌కాన్ని కేంద్రం ప్ర‌వేశ‌పెట్టిందా..? అన్న దానికి.. అధికారులు వివ‌ర‌ణ ఇచ్చారు.

రాష్ట్రీయ శిక్షిత్ బేరోజ్‌గార్ యోజ‌న అనే ప‌థకాన్ని మోదీ ప్ర‌వేశ‌పెట్టార‌ని, అందులో భాగంగా దేశ‌వ్యాప్తంగా ఉన్న రేష‌న్ కార్డులంద‌రికీ రూ.50వేలు ఇస్తార‌ని.. ఓ మెసేజ్ ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో బాగా వైర‌ల్ అవుతోంది. అయితే దీనిపై ప్రెస్ ఇన్ఫ‌ర్మేష‌న్ బ్యూరో (పీఐబీ) ఫ్యాక్ట్ చెక్ ద్వారా వివ‌ర‌ణ ఇచ్చింది. నిజానికి ఇలాంటి స్కీంను కేంద్రం ఇంకా ప్ర‌వేశ‌పెట్ట‌లేద‌ని, ఇది ఎంత మాత్రం నిజం కాద‌ని, పూర్తిగా అబ‌ద్ద‌మ‌ని, ఈ వార్త‌ను న‌మ్మి ఎవ‌రూ మోస‌పోవ‌ద్ద‌ని.. పీఐబీ తెలిపింది. ఈ మేర‌కు పీఐబీ ట్వీట్ చేసింది.

చూశారు క‌దా.. కేటుగాళ్లు ఎలా న‌కిలీ వార్త‌లు ప్ర‌చారం చేస్తున్నారో. మీరు కూడా ఇలాంటి వార్త‌ల‌ను చూస్తే వెంట‌నే న‌మ్మ‌కండి. అది నిజ‌మా, కాదా అని ముందుగా నిర్దారించుకోండి. లేదంటే మోస‌పోతారు జాగ్ర‌త్త‌..!

Read more RELATED
Recommended to you

Exit mobile version