బాలకృష్ణ ని నేను హ్యాండిల్ చేయలేను ..సెన్షేషనల్ కామెంట్స్ చేసిన దర్శకుడు తేజ ..!

-

నట సింహం నందమూరి బాలకృష్ణ తో సినిమా తీయాలని పూరి జగన్నాధ్ లాంటి వాళ్ళు రెడీగా ఉంటారు. ఇక బోయపాటి శ్రీను, క్రిష్, వినాయక్, బి.గోపాల్ లాంటి వాళ్ళ దగ్గర్నుంచి యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి వరకు చాలామంది ఎంతో ఆసక్తిగా ఉంటారు. ఆయన తో ఒక ఫ్యాక్షన్ సినిమా అయినా.. హిస్టారికల్.. జానపదం.. , మాస్ యాక్షన్ సినిమా అయినా …ఇలా జోనర్ ఏదైనా బాలయ్య సినిమా అంటే దర్శకులని వచ్చే ఊపే వేరు. అంతేకాదు క్రియోటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ లాంటి దర్శకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు.

 

అలానే దర్శకుడు తేజ కూడా. అయితే ఈ దర్శకుడు ఊహించకుండానే బాలకృష్ణ ని డైరెక్ట్ చేసే అవకాశం వచ్చింది. అది కూడా బాలకృష్ణ తండ్రి సీనియర్ ఎన్.టి.ఆర్ నందమూరి తారకరామారావు జీవిత కథ. ఈ బయోపిక్ ని రెండు భాగాలుగా నిర్మించాలనుకున్న బాలయ్య చాలామంది దర్శకులను పరిశీలించాక ఆ అవకాశం తేజ కి ఇచ్చారు. ఒకేసారి రెండు భాగాలను తెరకెక్కించడం అంటే ఏ దర్శకుడికైనా జీవితంలో గొప్ప అవకాశమే. అందుకే తేజ ఏమాత్రం ఆలోచించకుండా ఎన్.టి.ఆర్ బయోపిక్ ని తెరకెక్కించడానికి ఒప్పుకున్నాడు. అంగరంగ వైభవంగా ఈ సినిమా ప్రారంబోత్సవం జరిగింది. అయితే పట్టుమని పదిరోజులు కూడా షూటింగ్ జరగకుండానే తేజ ఈ ప్రాజెక్ట్ నుండి బయటకు వచ్చాడు.

అయితే అందుకు కారణాలు చాలానే ఉన్నాయని బాగా వార్తలు వచ్చాయి. ఒకటి బాలకృష్ణ ని తేజ హ్యాండిల్ చేయలేకపోయాడని..అలాగే రామారావు బయోపిక్ అందులోను రెండు భాగాలు అంటే తేజ భయపడ్డాడని అన్నారు. ఇక తేజ దర్శకుడన్న మాటేగాని బాలకృష్ణ డైరెక్ట్ చేస్తుండటం తేజ సహించలేకపోయాడట. రెండు భాగాలలో భారీ కాస్టింగ్ ఉండటంతో తేజ భారంగా ఫీలయ్యాడట. అందుకే ఈ బయోపిక్ నుండి నేను చేయలేను అంటూ నిర్మొహమాటంగా బయటకు వచ్చాడట తేజ. ఇదే మాట తేజ కూడా ఓపెన్ గానే చెప్పాడు. బాలకృష్ణ లాంటి హీరోతో భారీ ప్రాజెక్ట్ ని హ్యాండిల్ చేయలేకే డ్రాపయ్యాని వెల్లడించాడు. ఆ తర్వాత ఈ సినిమాని క్రిష్ డైరెక్ట్ చేసిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version