ఫ్యాక్ట్ చెక్: ప్రభుత్వం అందరికి ఉచితంగా ల్యాప్‌టాప్‌లను ఇస్తుందా?

-

సోషల్ మీడియాలో ప్రపంచ వ్యాప్తంగా ఉండే ఎన్నో విషయాల గురించి తెలియజేస్తుంది.. కొన్ని మంచికి సంభంధించినవి ఉంటే మరి కొన్ని మాత్రం జనాలను మోసం చేస్తున్నాయి.అలాంటి వాటిలో కొన్ని వార్తలు ఫేక్ అయిన ప్రజలు గుడ్డిగా నమ్మి మోసపోతున్నారు.ప్రభుత్వ పథకాల పేరుతో ఎన్నో మెసేజ్ లో వస్తూనే ఉన్నాయి.వాటికి ఎప్పటికప్పుడు అధికారులు అలర్ట్ చేస్తూ ఒక క్లారిటీ ఇస్తున్నారు..తాజాగా మరో వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది..

విద్యా మంత్రిత్వ శాఖ 5 లక్షల ల్యాప్‌టాప్‌లను ఉచితంగా విద్యార్థులకు ఇస్తున్న మెసేజ్. దీనిపై ప్రెస్ ఇన్‌ఫర్మేషన్ బ్యూరో(PIB) క్లారిటీ ఇచ్చింది. ఈ మెసేజ్ పూర్తిగా తప్పుడుదని పీఐబీ తెలిపింది. అలాంటి స్కీమ్‌ను ప్రభుత్వం ఆఫర్ చేయడం లేదని పేర్కొంది.పీఐబీ తన ఫ్యాక్ట్ చెక్ ట్విటర్ హ్యాండిల్ ద్వారా ఈ మెసేజ్‌‌పై క్లారిటీ ఇచ్చింది. వైరల్ అవుతోన్న ఈ పోస్టు స్క్రీన్‌షాట్‌ను పీఐబీ ఫ్యాక్ట్ చెక్ షేర్ చేసింది. దీనికి ఒక క్యాప్షన్‌ను కూడా జత చేసింది. ‘విద్యార్థులందరికీ ఉచితంగా 5 లక్షల ల్యాప్‌టాప్‌లను విద్యా మంత్రిత్వ శాఖ ఆఫర్ చేస్తున్నట్టు సోషల్ మీడియాలో ఓ వెబ్‌సైట్ లింక్ మెసేజ్ రూపంలో వైరల్ అవుతుంది.

ఇది పూర్తిగా ఫేక్ అని, ప్రభుత్వం ఇలాంటి పథకాలను అమలు చేయలేదని తేల్చి చెప్పింది.మీ వ్యక్తిగత వివరాలను కూడా ఆ లింక్ ద్వారా చోరి చేస్తున్నారు. ఉచితాలంటూ వచ్చే ఇలాంటి మెసేజ్‌లపై నెటిజన్లు అప్రమత్తంగా ఉండాలని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ హెచ్చరిస్తోంది. ఇలాంటి మెసేజ్ సోషల్ మీడియాలో కొత్తెమి కాదు..గతంలో చాలా సార్లు ఇలాంటివి వైరల్ అయ్యాయి.ప్రభుత్వం అలాంటి పథకాలను అమలు చేస్తే మాత్రం ముందుగా ప్రకటన ఇస్తుంది.దయచేసి సోషల్ మీడియాలో వచ్చే వార్తలను నమ్మి మోస పోకండి అని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version