పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో.. విజయ్ దేవరకొండ హీరోగా తాజాగా తెరకెక్కుతున్న చిత్రం లైగర్. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ఇప్పుడు నేషనల్ వైడ్ ట్రెండింగ్ లో ఉండడం గమనార్హం. ఇకపోతే ఈ సినిమాపై స్టోరీ అదేనా అనే అనుమానాలు కూడా ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతున్నాయి. ట్రైలర్ విడుదలైన 24 గంటల్లోనే 16 మిలియన్స్ పైగా న్యూస్ సొంతం చేసుకొని సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. ఇకపోతే ఈ సినిమా పోస్టర్ పై నెటిజన్లు పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇది కట్ ఔట్ లాగా లేదు కట్ డ్రాయర్ ఆడ్ లా వుంది అంటూ కూడా గేళి చేసిన వారు ఉన్నారు. మరి కొంతమంది ఏమో విజయ్ దేవరకొండ న్యూడ్ ఫోటోపై ట్రోల్ చేశారు.
ఈ టైగర్ మూవీ కి ట్యాగ్ లైన్ సాలా క్రాస్ బీడ్ అని కూడా పెట్టారు. ఇక ఈ సినిమాలో విజయ్ దేవరకొండకు తల్లిపాత్రలో రమ్యకృష్ణ నటిస్తుండగా, తండ్రి పాత్రలో మైక్ టైసన్ నటిస్తున్నాడనే వార్తలు కూడా వైరల్ అవుతున్నాయి.. ఇక క్రాస్ బీడ్ అంటే ఇండియన్ అమ్మకు, ఫారిన్ తండ్రికి పుట్టిన ఒక అబ్బాయి స్టోరీని ఈ లైగర్ అని సమాచారం. ఇక ఇదంతా చూస్తూ ఉంటే అప్పట్లో తెరకెక్కించిన అమ్మానాన్న ఓ తమిళమ్మాయి సినిమా స్టోరీని కాస్త మార్చి లైగర్ సినిమాగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. నేటిజన్స్ కూడా లైగర్ సినిమాపై రకరకాల వ్యాఖ్యలు చేస్తూ ఉండడం గమనార్హం. ఇక గత సినిమాల తరహాలోనే లైగర్ సినిమాను కూడా తెరకెక్కించినట్టు.. ఇక ఈ సినిమాలో ప్రత్యేకమైన అంశాలు ఏమీ లేకపోయి ఉండవచ్చు అని కూడా కొంతమంది అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.
ఇక అమ్మానాన్న తమిళ అమ్మాయి స్టోరీ అయి ఉండవచ్చని ట్రైలర్ చూసినవాళ్లు చెబుతున్నారు. ఇక సినిమా స్టోరీ ని పెద్దగా మార్చకపోయినా పెద్దగా స్టార్ పొజిషన్ లేని హీరోతో ఏకంగా రూ. 160 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి పూరీ జగన్నాథ్, చార్మి సాహసం చేస్తున్నారని వార్తలు కూడా వినిపిస్తూ ఉండడం గమనార్హం.