తెలంగాణ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి విమర్శనాస్త్రాలు ఎక్కుబెట్టారు. రేషన్ కార్డుల కోసం పదే పదే దరఖాస్తులు కోరుతున్న తీరును చూస్తుంటే.. అసలు రేషన్ కార్డులు ఇచ్చే ఉద్దేశం ప్రభుత్వానికి ఉందా ?.. ఇంకెన్నిసార్లు ఇవ్వాలంటూ కేటీఆర్ ‘ఎక్స్’ వేదికగా మండిపడ్డారు.ఒక్క రేషన్ కార్డు కోసం..ఇంతగనం జనాన్ని పరేషాన్ జేస్తరా? అని ప్రశ్నించారు.
‘ఇంకెన్నిసార్లు ఇయ్యాలె..అప్లికేషన్లు ? ప్రజాపాలన కార్యక్రమంలో ఇచ్చిండ్రు..ప్రజాభవన్‌కు వచ్చి ఇచ్చిండ్రు..గాంధీభవన్‌కు వచ్చి ఇచ్చిండ్రు..గ్రామసభల్లో ఇయ్యమంటే మళ్లీ ఇచ్చిండ్రు..ఇన్నిసార్లు ఇచ్చినంక మళ్లీ మొత్తం కథ మొదటికి తెస్తరా? అని కేటీఆర్ నిలదీశారు. ఏడాది అయిపాయె! ఇచ్చిన అప్లికేషన్లు చెత్తకుప్పల పాలాయె..మళ్లీ కొత్తగా ‘మీ సేవలో’ దరఖాస్తు చేయాలా? తమాషా చేస్తున్నరా? గరీబోళ్లతో ఆటలాడుతున్నరా? అని ప్రభుత్వం తీరుపై ఫైర్ అయ్యారు.
ఒక్క రేషన్ కార్డు కోసం..
ఇంతగనం జనాన్ని పరేషాన్ జేస్తరా ??ఇంకెన్నిసార్లు ఇయ్యాలె.. అప్లికేషన్లు ?
ప్రజాపాలన కార్యక్రమంలో ఇచ్చిండ్రు..
ప్రజాభవన్ కు వచ్చి ఇచ్చిండ్రు..గాంధీభవన్ కు వచ్చి ఇచ్చిండ్రు..
గ్రామసభల్లో ఇయ్యమంటే మళ్లీ ఇచ్చిండ్రు..ఇన్నిసార్లు ఇచ్చినంక..
మళ్లీ మొత్తం… pic.twitter.com/G5NezXeqhn— BRS Party (@BRSparty) February 11, 2025