చిలుకూరు బాలాజీ ఆలయం ప్రధాన అర్చకులు రంగరాజన్‌పై జరిగిన దాడిని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తీవ్రంగా ఖండించారు. దాడికి పాల్పడిన దుండగులపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే సర్వనాశనమే అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
![KA Paul](https://cdn.manalokam.com/wp-content/uploads/2025/02/Untitled-1-copy-1024x681.jpg)
ఈ ఘటనపై సోషల్ మీడియా ‘ఎక్స్’ వేదికగా కేఏ పాల్ ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు.కేఏ పాల్ మాట్లాడుతూ..చిలుకూరు బాలాజీ ఆలయ పూజారిపై 22 మంది దుండగులు వెళ్లి దాడి చేయడం దారుణమని విమర్శించారు.ఈ మధ్యకాలంలో చర్చిల్లోకి, మసీదుల్లోకి వెళ్లి దాడులు చేసే కల్చర్ పెరిగిపోయిందన్నారు. రామరాజ్యం సైనికులు రాముడి పేరుతో వెళ్లి రంగరాజన్‌పై దాడి చేయడం దారుణమని మండిపడ్డారు. నిందితులపై నాన్-బెయిలబుల్ వారెంట్స్ జారీ చేసి, జైల్లో పెట్టాలని డిమాండ్ చేశారు.