కరోనాను ఎదుర్కోవడానికి వ్యాక్సిన్ ( Vaccine ) ఒక్కటే సరైన మార్గమని ప్రతీ ఒక్కరు విశ్వసిస్తున్నారు. వ్యాక్సిన్ తీసుకునే ముందు, తీసుకున్న తర్వాత కొన్ని చర్యలు పాటిస్తే వ్యాక్సిన్ సామర్థ్యం మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. వివరాల్లోకి వెళితే, కొందరిలో వ్యాక్సిన్ సామర్థ్యం తగ్గడానికి ప్రధాన కారణాలో రోగనిరోధక శక్తి సరిగ్గా లేకపోవడం, ఇతర అనుబంధ వ్యాధులు కూడా కారణం అవుతున్నాయని అంటున్నారు. అందుకే వ్యాక్సిన్ తీసుకునే సమయం పట్ల శ్రద్ధ వహించాలని సూచిస్తున్నారు.
వ్యాక్సిన్లపై చాలా రోజులుగా జరుగుతున్న పరిశోధనలు, దాన్ని తీసుకునే సమయం మీద వ్యాక్సిన్ సామర్థ్యం మీద ఆధారపడి ఉంటుందని అంటున్నారు.
రోగనిరోధక శక్తి అనేది నిరంతర ప్రక్రియ. అది ఒక్కోసారి ఒక్కోలా ఉంటుంది. ఉదయం ఉన్నట్టుగా సాయంత్రం ఉండకపోవచ్చు. ఈ విషయం యాంటీడిప్రెషన్ మందులు వాడేవారికి బాగా అర్థం అవుతుంది. సాధారణంగా ఆ మందులు రాత్రిపూట మాత్రమే ప్రిఫర్ చేస్తారు.
ఐతే ఏ సమయంలో వ్యాక్సిన్ తీసుకోవడం మంచిది?
సాధారణంగా డేటైమ్ లో వ్యాక్సిన్ తీసుకోవడం ఉత్తమం అని, దానివల్ల రాత్రి వేళకి కొద్దిగా సమయం ఉండి, ఆ తర్వాత హాయిగా పడుకోవచ్చు. ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నట్టయితే ఆ సమయంలోపు తెలిసిపోతాయన్న ఉద్దేశ్యంలో డే టైమ్ నే సూచిస్తారు.
ఇంకా ఏం తెలుసుకోవాలంటే
వ్యాక్సిన్ వేసుకునే ముందు ఖచ్చితంగా కావాల్సినన్ని నీళ్ళు తాగండి. ఇంకా, భోజనం చేసిన తర్వాతే టీకా వేసుకోండి. ఖాళీ కడుపుతో వ్యాక్సిన్ వేసుకోవద్దు.
ప్రాసెస్ చేసిన ఆహారాలు ముట్టుకోకుండా ఉంటేనే బెటర్.
వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి.
కరోనా లక్షణాలు కనిపిస్తున్నట్లయితే వ్యాక్సిన్ వేసుకోవడాన్ని వాయిదా వేయండి.
పెయిన్ కిల్లర్స్, ఇంకా ఇతర నొప్పులను తగ్గించే మందులను వేసుకోవద్దు. ఈ విషయంలో డాక్టరును సంప్రదించాలి.