విషాదం…! యజమాని చనిపోయిందని.. ఈ శునకం ఆత్మహత్య చేసుకుంది..!

-

dog committed suicide after the death of her mother
dog committed suicide after the death of her mother

ఎంతో విషాదం…! హృదయాన్ని కలచి వేసే వార్త ఇది. తన యజమాని చనిపోయిందని తెలిసి ఓ శునకం ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాదం ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లోని కాన్పూర్ లో చోటు చేసుకుంది. కాగా మీడియాకు కొంత ఆలస్యంగా విషయం తెలిసింది. వివరాల్లోకి వెళితే… కాన్పూర్ లో డాక్టర్ గా విదులు నిర్వహిస్తున్న అనితా రాజ్ సింగ్ హెల్త్ డిపార్ట్ మెంట్ లో జాయింట్ డైరెక్టర్ గా పని చేస్తుంది. తాను పని చేస్తున్న ఆసుపత్రి పక్కన గాయాలతో పడి ఉన్న ఓ శునకాన్ని అనిత తన ఇంటికి తీసుకువచ్చి ఆ శునకానికి వైద్యం చేసి తన ఇంట్లోని మనిషిగా చూసుకుంటుంది.

ఇక అప్పటినుండి దాదాపుగా 12 ఏళ్లపాటు ఆ శునకం అనితా తో పాటే తన ఇంట్లో ఉంటుంది. కాగా అనిత అనారోగ్యంతో బుధవారం మరణించారు, ఆమె మృతదేహాన్ని ఇంటికి తీసుకుని రాగానే శునకానికి ఆ విషయం తెలిసింది. తన యజమాని చనిపోవడాన్ని ఆ శునకం జీర్ణించుకోలేకపోయింది దాంతో రెండవ అంతస్తుకు వెళ్ళి అక్కడనుండి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఇటు పక్క తన యజమాని అంత్యక్రియలు జరిగాయి అటు పక్క ఆ శునకం  కళేబరాన్ని పూర్చి పెట్టారు.. ఈ వార్త చదివిన ప్రతీ ఒక్కరూ తీవ్ర భావోద్వేగానికి గురవుతున్నారు. అందుకేనేమో శునకం తన యజమానిని తనకన్నా ఎక్కువగా ప్రేమిస్తుంది అని అంటారు…!

Read more RELATED
Recommended to you

Exit mobile version