ఉదయభాను ఛాలెంజ్ ను స్వీక‌రించిన రేణు దేశాయ్

-

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. దీనికి మంచి స్పందనే వచ్చింది. ఇప్పటికే ఎంతో మంది సినీ తారలు, రాజకీయ నాయకులు, ప్రముఖులు చాలా మంది ఈ ఛాలెంజ్‌ ను స్వీకరించారు. తాజాగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 3వ విడతలో భాగంగా ప్రముఖ యాంకర్ ఉదయభాను విసిరిన చాలెంజ్ ను ప్రముఖ నటి రేణు దేశాయ్ స్వీకరించారు.

తన కుమార్తె ఆద్యతో కలిసి పలు మొక్కలు నాటారు. హరితహారంలో భాగంగా గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ స్పూర్తితో ప్ర‌తి ఒక్క‌రు త‌మ‌కి తాము ఛాలెంజ్ విసురుకొని మొక్క‌లు నాటాల‌ని రేణు విజ్ఞప్తి చేశారు. అలాగే చిన్న పిల్ల‌ల‌ను ఇందులో భాగం చేయ‌డం వ‌ల్ల వారికి మొక్క‌లు ఎలా నాటానే విష‌యం కూడా తెలుస్తుంది. ఇంత మంచి కార్య‌క్ర‌మం చేప‌ట్టిన సంతోష్‌గారికి అభినంద‌న‌లు అని తెలిపారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version