చాల మందికి ఇతరులతో కలిసి ఉండడం, మాట్లాడడం ఇష్టం ఉండదు. పైగా అదో రకమైన సిగ్గు వాళ్లలో ఉంటుంది. అయితే మీరు కూడా ఇంట్రావర్ట్ అయితే ఇలా చేయండి. అప్పుడు మిమ్మల్ని ఇంట్రావర్ట్ అని అనే అవకాశం ఎవరికీ రాదు.
ఒంటరిగా సమయాన్ని కేటాయించద్దు:
సాధారణంగా ఇంట్రావర్ట్స్ ఒంటరిగా ఉంటూ ఉంటారు. కానీ అలా చేయడం మంచిది కాదు. మీరు కనుక దీన్ని ఫిక్స్ చేసుకోవాలి అనుకుంటే అందరితోనూ సమయాన్ని గడపండి. మరొకరితో మీరు సమయాన్ని పంచుకోవడం వల్ల మీరు దీనిని ఫిక్స్ చేసుకోవచ్చు. మీ ఆలోచనలు షేర్ చేసుకోవడం లేదా మీ క్రియేటివిటీని పంచుకోవడం లాంటివి చేస్తే మీరు ఎదుటి వాళ్ళతో సులువుగా మూవ్ అవ్వచ్చు.
మీ మొబైల్ ని ఉపయోగించండి:
సాధారణంగా ఇంట్రావర్ట్స్ ఎక్కువగా ఫోన్లు మాట్లాడడం, మెసేజ్ చేయడం, ఫ్రెండ్స్ తో కబుర్లు చెప్పడం లాంటివి చేయరు. ఇప్పుడు మీరు ఈ సమస్య ని ఫిక్స్ చేసుకోవాలంటే మీరు ఇతరులతో మాట్లాడుతూ ఉండండి. అలానే టెక్స్ట్ చేసుకోవడం, షేర్ చేసుకోవడం లాంటివి చేస్తూ ఉంటే మీరు దీనిని ఎంతో సులువుగా ఫిక్స్ చేసుకోవచ్చు.
ఎక్కువగా మాట్లాడండి:
గ్రూప్ డిస్కషన్స్, సెమినార్స్ లేదా ఏదైనా ఇతర పోటీలు జరిగినప్పుడు ఎప్పటిలాగే వెనక్కి ఉండిపోకండి. మీరు మాట్లాడితే దీన్ని ఫిక్స్ చేసుకోవచ్చు. కాబట్టి నిశ్శబ్దంగా ఉండకుండా వీటిని అనుసరిస్తే తప్పకుండా మీరు ఈ సమస్యను సాల్వ్ చేసుకోగలరు. ఇలా మీరు నెమ్మది నెమ్మదిగా వీటిని కనుక ఫాలో అయ్యారంటే మిమ్మల్ని ఇంట్రావర్ట్ అని ఎవరు అనరు.