దీపావళికి చైనా వస్తువులకు చెక్‌.. అద్భుతమైన వస్తువులను తయారు చేస్తున్న దేశీయ కళాకారులు..

-

మన దేశంలో ప్రతి రంగంలోనూ చైనా ఎలా డామినేట్‌ చేస్తుందో అందరికీ తెలిసిందే. దీపావళి పండుగ విషయానికి వస్తే పండుగ సందర్భంగా అమ్ముడుపోయే బాణసంచా మొదలుకొని అలంకరణ విద్యుద్దీపాలు, బల్బులు, ఇతర అలంకరణ సామగ్రి.. ఇలా ఒక్కటేమిటి.. అనేక వస్తువులు చైనాకు చెందినవే అమ్ముతుంటారు. కానీ ప్రతి ఏడాది అలా జరిగింది కానీ ఈసారి చైనాతో నెలకొన్న వివాదాల నేపథ్యంలో ఆ దేశ వస్తువులను చాలా మంది కొనడం లేదు. బాణసంచాను కూడా నిషేధించారు. ఈ క్రమంలోనే దేశీయ కళాకారులకు, మహిళలు, స్వయం ఉపాధి కార్మికులకు పని దొరికింది. వారు తమ ఉత్పత్తులను అమ్ముకునే మార్గం ఏర్పడింది.

దీపావళి పండుగకు ప్రజలు ఉపయోగించే అనేక రకాల వస్తువులను ప్రస్తుతం దేశీయ కళాకారులు, కార్మికులు పెద్ద ఎత్తున తయారు చేస్తున్నారు. వాటిని దీపావళి సందర్భంగా దేశవ్యాప్తంగా అనేక చోట్ల విక్రయించనున్నారు. అందుకు గాను ప్రత్యేక ఎగ్జిబిషన్లు కూడా ఏర్పాటు చేయనున్నారు. దీంతో దేశీయ కళాకారులకు, కార్మికులకు ఉపాధి లభించనుంది. పైగా చైనా దేశానికి చెంప పెట్టులా అవుతుంది. అందుకనే కన్ఫడెరేషన్‌ ఆఫ్‌ ఆలిండియా ట్రేడర్స్‌ కూడా మన కళాకారుల వస్తువులను కొనాలని ప్రోత్సహిస్తోంది.

ఎంతో అందంగా తయారు చేసిన ప్రమిదలు, అలంకరణ విద్యుద్దీపాలు, బల్బులు, అలంకరణ సామగ్రి ఇప్పటికే జనాలను ఆకర్షిస్తున్నాయి. అలాగే తక్కువ ధరలకే వీటిని విక్రయిస్తున్నారు. పలు వస్తువులను కొంటే ఇతర వస్తువులను ఉచితంగా ఇచ్చే ఏర్పాటు కూడా చేయనున్నారు. ఇక వీటిని ఆన్‌లైన్‌లోనూ విక్రయించనున్నారు. కనుక దీపావళికి ఈసారి చైనా వస్తువులు కాకుండా మన కార్మికులు తయారు చేసిన వస్తువులను వాడండి. వారికి ఉపాధి కల్పించండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version