అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కి కరోనా సోకింది. ఆయనతో పాటు అమెరికన్ ఫస్ట్ లేడీ మేలానియా ట్రంప్ కి కూడా కరోనా సోకింది. నిజానికి వీరి సహాయకులలో ఒకరైన హోప్ హిక్స్ కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో క్వారెంటైన్ కి వెళ్ళిపోయినా ట్రంప్ దంపతులు కూడా పరీక్ష చేయించుకున్నారు. ఈ పరీక్షల్లో వీరిద్దరికీ కూడా కరోనా అని తేలింది. ఈరోజు రాత్రి నాకు మేలానియాకి కరోనా అని తేలింది. మేము ఇప్పుడే క్వారెంటైన్ కి వెళ్లి రికవరీ అయ్యే పనిలో ఉంటాం.
ఇద్దరం కలిసే దీని నుండి బయట పడతామని పేర్కొంటూ ట్రంప్ ట్వీట్ చేశారు. ఇక మొన్న క్లీవ్ ల్యాండ్‌లో జరిగిన సమావేశంతో సహా హోప్ హిక్స్ ట్రంప్ తో కలిసి పలుసార్లు ప్రయాణించారు. ట్రంప్ మిన్నెసోటాలో ప్రచార ర్యాలీకి వెళుతుండగా మొన్న బుధవారం మెరైన్ వన్ లో కూడా ట్రంప్ తో పాటుగా ప్రయాణించారు హోప్ హిక్స్. తాజాగా కోవిడ్ మరణాల విషయంలో భారత్ తప్పుడు లెక్కలు చూపిస్తోందని డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు. కేస్ వెస్ట్రన్ రిజర్వ్ యూనివర్సిటీలో జరిగిన అమెరికా అధ్యక్ష అభ్యర్థుల తొలి చర్చలో రిపబ్లిక్ అభ్యర్ది డొనాల్డ్ ట్రంప్, డెమొక్రాటిక్ అభ్యర్ధి జో బిడెన్ మధ్య జరిగిన వాదనలో ట్రంప్ ఈమేరకు కామెంట్స్ చేశాడు.