తిరుమల తిరుపతి దేవస్థానానికి ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉంది. రెండు తెలుగు రాష్ట్రాలతోనే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న ఆలయాల్లో కేరళ అనంతపద్మనాభస్వామి ఆలయం తర్వాత రెండో అత్యంత ధనిక ఆలయంగా తిరుమలకు పేరుంది. తిరుమల రోజూ వారీ హుండీ ఆదాయమే కోట్లల్లో ఉంటుంది. ఇక స్వామివారి ఆస్తుల గురించి ప్రత్యేక చెప్పనక్కరలేదు.
తాజాగా స్వామివారికి ఓ భక్తురాలు ఏకంగా రూ.2 కోట్ల విలువైన స్వర్ణ వైజయంతీ మాలను బహుకరించింది. ఏపీ మాజీ ఎంపీ, టీటీడీ ఛైర్మన్‌గా పని చేసిన డీకే ఆదికేశవులు మనవరాలు తేజస్వీ ఈ స్వర్ణ వైజయంతీ మాలను టీటీడీకి విరాళంగా ఇచ్చింది. ఇక తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారికి మరో వైజయంతీ మాలను శుక్రవారం విరాళం ఇస్తామని తేజస్వీ తెలిపారు.
తిరుమల శ్రీవారికి రూ. 2 కోట్ల విలువైన వజ్ర వైఢూర్యాలు పొదిగిన స్వర్ణ వైజయంతీమాల విరాళం
వైజయంతీ మాలను బహూకరించిన మాజీ ఎంపీ, టీటీడీ ఛైర్మన్‌గా పని చేసిన డీకే ఆదికేశవులు మనవరాలు తేజస్వీ
తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారికి మరో వైజయంతీ మాలను రేపు విరాళమివ్వనున్న దాత… pic.twitter.com/H319ZzSwNx
— BIG TV Breaking News (@bigtvtelugu) November 14, 2024