వైసీపీ హయాంలో ఇళ్ల పట్టాల్లో రూ.2లక్షల కోట్ల అవినీతి : ఎమ్మెల్యే బండారు

-

వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇళ్ల పట్టాల పంపిణీలో రూ.2లక్షల కోట్ల అవినీతి జరిగిందని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి ఆరోపించారు. గురువారం అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఆయన మాట్లాడుతూ.. వైవీ సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి విశాఖలోనే రూ.40వేల కోట్లు దోచుకున్నారని చెప్పారు. దీనిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.

ఒకవేళ వైసీపీ చేసిన అవినీతిని తాను నిరూపించలేకపోయినట్లు అయితే ప్రభుత్వం ఏ శిక్ష విధించినా అందుకు బాధ్యత వహిస్తానని ఎమ్మెల్యే బండారు అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. ఇదిలాఉండగా, వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టినప్పటి నుంచి వైసీపీకి చెందిన ఏ ఎమ్మెల్యే హౌస్‌లో అడుగుపెట్టలేదు. మాజీ సీఎం జగన్ సైతం అసెంబ్లీకి రానని ప్రకటించిన విషయం తెలిసిందే.

 

 

Read more RELATED
Recommended to you

Latest news