నల్గొండ జిల్లా మునుగోడు మండలం పలివెలలో బిజెపి, టిఆర్ఎస్ కార్యకర్తల మధ్య మాట పెరిగి ఇరువు పార్టీల కార్యకర్తలు ఒకరిపై ఒకరు రాళ్లు, కర్రలతో దాడి చేసుకున్నారు. బిజెపి నేత ఈటెల రాజేందర్, టిఆర్ఎస్ నేత పల్లా రాజేశ్వర్ రెడ్డి ఒకేసారి ఎదురు కావడంతో ఇరు పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణకు దారితీసింది. ఈ ఘటనపై మంత్రి కేటీఆర్ స్పందించారు. పలివెలలో మా నేతలపై బిజెపి గుండాలు దాడి చేశారని.. ఓడిపోతున్నారు కాబట్టే ఇలా చేశారని ఆరోపించారు మంత్రి కేటీఆర్.
కార్యకర్తలు ఎవరు టెంప్ట్ కావద్దని.. ఆవేశ పడద్దని అని సూచించారు. ఈ ఘటనపై కేసు పెట్టామని, పోలీసులే చూసుకుంటారని అన్నారు. ఈ పోటీ రెండు భావజాలాల మధ్య.. మునుగోడు ఓటర్లు ఏ గట్టున ఉంటారు? ఆ గట్టున రాబందు మోడీ ఉన్నారు.. ఈ గట్టున రైతుబంధు కేసీఆర్ ఉన్నారని ఏ గట్టున ఉంటారో మునుగోడు ప్రజలు ఆలోచించుకోవాలన్నారు. ప్రభాకర్ రెడ్డిని గెలిపిస్తే మునుగోడుని దత్తత తీసుకొని 14 నెలలలో అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు.