మీకు జన్ ధన్ ఎకౌంట్ ఉందా..? అయితే ఈ తప్పులు చెయ్యద్దు..!

-

జన్ ధన్ ఎకౌంట్ వున్న వాళ్ళు ఏఈ విషయాలు తెలుసుకోవాలి. లేదంటే ఛార్జీలు పడతాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన ముఖ్యమైన స్కీమ్స్‌ లో జన్ ధన యోజన కూడా ఒకటి అని తెలుసు. దేశం లోని పేదలందరికీ కూడా బ్యాంక్ అకౌంట్ ఉండాలనే లక్ష్యం తో మోదీ సర్కార్ ఈ పథకాన్ని తీసుకు రావడం జఱిగింది. ఈ స్కీమ్ కింద జన్ ధన్ ఖాతా ఎవరైనా తెరవొచ్చు.

ఇది జీరో బ్యాలెన్స్ అకౌంట్. అయితే మీకు కూడా జన్ ధన్ ఎకౌంట్ ఉందా అయితే ఈ తప్పులు చెయ్యకండి. ఇప్పుడు బ్యాంకులు ఈ బ్యాంక్ ఖాతా ఉన్న వారి దగ్గరి నుంచి చార్జీలు వసూలు చేస్తున్నాయి. రూ.20 వరకు చార్జీ పడుతుంది. అయితే ఎందుకు ఈ చార్జీలు పడుతున్నాయి అనేది కూడా చూద్దాం.

ఇది బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్. కనుక మీ జన్ ధన్ అకౌంట్‌లో మినిమమ్ బ్యాలెన్స్ కలిగి ఉండాల్సిన పని లేదు. అయితే మామూలుగా అయితే ఎలాంటి చార్జీలు పడవు. కానీ ఉచిత లావాదేవీల పరిమితి దాటితే అంతే. కాబట్టి పరిమితి దాటకుండా చూసుకోవడం ముఖ్యం.

నెలకు 4 ఉచిత లావాదేవీలు నిర్వహించొచ్చు. ఈ లిమిట్ దాటితే ప్రతి లావాదేవీకి రూ.20 వరకు చార్జీ పడుతుంది. ఐఐటీ బాంబే నివేదిక ప్రకారం ఎస్‌బీఐ 2015 నుంచి 20 వరకు ఐదేళ్ల కాలంలో 12 కోట్ల జీరో బ్యాలెన్స్ అకౌంట్ల నుంచి ఏకంగా రూ.300 కోట్లను చార్జీల రూపంలో వసూలు చేసింది.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version