వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ దూకుడు పెంచిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పులివెందులలో మకాం వేసిన సీబీఐ బృందం వరుసగా విచారణ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే విచారణలో భాగంగా ఈరోజు మరికొంత మందిని అధికారులు విచారణ చేయనున్నట్లు చెబుతున్నారు. నిన్నటి విచారణలో భాగంగా వైఎస్ వివేకా పీఏ కృష్ణారెడ్డి,,తోటమాలి రాజశేఖర్ ని సీబీఐ అధికారులు విచారించారు. ఇక ఈ రోజు విచారణలో పలువురు వైఎస్ కుటుంబానికి సన్నిహిత వ్యక్తులను సీబీఐ అధికారులు విచారణ జరిపే అవకాశం ఉందని అంటున్నారు.
తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు ప్రధాన అస్త్రం గా మారింది. ఈ ఎన్నికల ప్రచారం సాగుతున్న తరుణంలో వైఎస్ వివేకానందరెడ్డి కూతురు డాక్టర్ సునీతారెడ్డి ఢిల్లీలో సీపీఐ అధికారులను కలిసి ఈ కేసు దర్యాప్తును వేగవంతం చేయాలని కోరారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య అంశంపై జగన్ కు ఈ నెల 7వ తేదీన లోకేష్ సవాల్ విసిరారు. మరోవైపు ఇదే అంశాన్ని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ తిరుపతి ఎన్నికల ప్రచారంలో ప్రస్తావించారు.