లాక్ డౌన్ అమలు విషయంలో ఏ మాత్రం కూడా లైట్ తీసుకోవద్దని ఏ విధంగా కూడా ఎవరు బయటకు వచ్చినా సరే రెడ్ జోన్ లో అసలు క్షమించవద్దు అని కేంద్ర సర్కార్ రాష్ట్రాలకు సూచనలు చేసింది. రెడ్ జోన్ లో ప్రజలు ఎవరూ కూడా బయటకు రావొద్దని హెచ్చరించింది. అన్నీ కూడా వారి ఇంటి వద్దకే వెళ్లి ప్రభుత్వాలు అందించాలి అని ఎవరిని కూడా రోడ్ల మీదకు రాకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం సూచనలు చేసింది.
లాక్ డౌన్ మే 17 వరకు పెంచారు. నేటి నుంచి రెండు వారాల పాటు దీన్ని అమలు చేస్తారు. గ్రీన్ జోన్ ఆరెంజ్ జోన్ లో కొన్ని సడలింపు లు ఇచ్చినా సరే మిగిలిన ప్రాంతాల్లో మాత్రం కఠినం గా ఉండాల్సిందే అని బయటకు ఎవరు వచ్చినా ఏ కార్యక్రమాలు నిర్వహించినా సరే వారి మీద దేశ ద్రోహం కేసులను నమోదు చెయ్యాలి అని కేంద్రం సూచించింది. అదే విధంగా ఎవరు బయటకు వచ్చినా సరే సరే వారిని క్వారంటైన్ కి పంపాలని,
బయటకు వచ్చిన వారిని వారి కుటుంబ సభ్యులు కూడా క్వారంటైన్ లో ఉండాల్సిందే అని కేంద్రం చెప్తుంది. ఏ విధంగా కూడా వెసులుబాట్లు ఇవ్వకుండా ఉండటమే మంచిది అని కేంద్రం భావిస్తుంది. ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు,, తెలంగాణా రాష్ట్రాల్లో కఠిన నిర్ణయాలను అమలు చెయ్యాలి అని కేంద్రం స్పష్టంగా చెప్పింది. వలస కూలీల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాల్సిందే అని పేర్కొంది. రాజకీయ నాయకులు బయటకు వచ్చినా సరే క్షమించవద్దు అని స్పష్టం చేసింది.