ఆదివారం హెయిర్ కట్ అస్సలు చేసుకోకండి..ఎందుకంటే?

-

జుట్టు పెరిగితే చేసుకుంటారు.అయితే హెయిర్ కట్ చేయించుకోవాలనుకునేవారు రోజును కూడా చూసుకొని చేసుకోవడం మేలని నిపుణులు అంటున్నారు.చాలా ఇళ్లలో పలనా రోజు అయితే హెయిర్ కట్ చేయించుకోకూడదని చెబుతుంటారు. ఇంట్లో వారి మాట కాదని చేయించుకున్నామో ఆరోజంతా సుప్రభాతమే.. హెయిర్ కట్ చేయించుకునేటప్పుడు రోజును చూస్తాం. అలాగే క్షవరం చేయించుకున్న తర్వా నేరుగా ఇంట్లోకి కూడా రానీవ్వరు ఇళ్లలో చాలామంది. అసలు కానీ క్షురకర్మలకు శాస్త్ర రీత్య కొన్ని సూచనలు ఉన్నాయి వారంలో ఏ రోజు మనం కటింగ్ చేయించు కుంటే శాస్త్ర పరంగా వాటి ఫలితాలు ఎలా ఉంటాయో చూద్దాం..

ఎప్పుడూ హెయిర్ కట్ చేయించుకున్నా కూడా ఉదయం 12 గంటల లోపు హెయిర్ కట్ చేయించుకుంటే శుభం కలుగుతుందని శాస్త్రం చెబుతోంది. రాత్రి సమయంలో కటింగ్ చేసుకోకూడదు. తండ్రి కొడుకులు, అన్నదమ్ములు ఒకే రోజు హెయిర్ కట్ చేసుకో కూడదని అంటున్నారు.. అదేమిటో ఇప్పుడు తెలుసుకుందాం…

సోమవారం: సోమవారం హెయిర్ కట్ చేయించుకుంటే ఏడు మాసములు ఆయువు వృద్ధి చెందుతుందని, సౌఖ్యం కలుగ జేస్తుందని పురాణాలు చెబుతున్నాయి. పుత్రులు కోరుకునే గృహస్థులు, ఒకే ఒక పుత్రుడు గలవారు క్షవరము చేయించుకోకూడదని శాస్త్రం చెప్తోంది.

మంగళవారం: సాధారణంగా చాలా మంది మంగళవారం హెయిర్ కట్ చేసుకోవద్దని చెబుతూ ఉంటారు. ఈరోజు కటింగ్ చేయించుకుంటే ఏనిమిది మాసములు ఆయువు తగ్గిపోతుంది. ఫలితంగా దు:ఖం కలుగుతుందని శాస్త్రం చెబుతోంది.

బుధవారం: ఈరోజు హెయిర్ కటింగ్ చేయించుకుంటే ఐదు మాసములు ఆయువు వృద్ధి చెందుతుందని విశ్వాసం.

గురువారం: ఈరోజున క్షవరము చేయించుకుంటే పది మాసములు ఆయువు వృద్ధి చెందుతుందని, ధనము కోరుకునేవారు గురువారము రోజు క్షవరము చేయించుకోకూడదని పురణాలు చెబుతున్నాయి. కాదని చేయించుకుంటే ధన నాశనం కలుగజేయునని శాస్త్రం చెబుతోంది.

శుక్రవారం: శుక్రవారం రోజున కూడా హెయిర్ కట్ చేయించుకోరు చాలామంది. ఈరోజు కూడా సెంటిమెంట్ గా ఫీలవుతారు. కాని శుక్రవారం రోజు కటింగ్ చేయించుకుంటే 11 మాసాలు ఆయువు వృద్ధి చెందుతుందని శాస్త్రం చెబుతోంది.

శనివారం: శనివారం రోజు హెయిర్ కట్ చేయించుకుంటే ఏడు మాసములు ఆయుక్షీణమ్ కలిగించునని, ఫలితంగా రోగ వృద్ధిని కలుగజేయునని శాస్త్రాన్ని నమ్మేవారు విశ్వసిస్తారు. ఇప్పటివరకు ఏ రోజుల్లో హెయిర్ కట్ చేయించుకోవాలి, ఏ రోజు చేయించుకోకూడదో తెలుసుకున్నాం.

ఆదివారం: చాలా మంది హెయిర్ కట్ చేయించుకోవడానికి ఆదివారాన్ని ఎంచుకుంటారు. ఎందుకంటే ఆరోజు అన్నిటికీ ఆ రోజు సెలవు.. అయితే ఆదివారం హెయిర్ కట్ చేయించుకుంటే ఒక మాసము ఆయువు తగ్గిపోతుంది. ఫలితంగా శరీరం అధిక వేడి పొందుతుందని శాస్త్రం చెబుతోంది.

అలాగే క్షురకర్మకు అనుకూలమైన తిధులు కొన్ని ఉన్నాయి…విదియ, తదియ, పంచమి, సప్తమి, త్రయోదశి, తిధులు క్షవరం చేయించుకోవడానికి శుభ తిధులుగా పేర్కొంటారు. అలాగే హస్త , చిత్త , స్వాతి , పునర్వసు, పుష్యమీ, మృగశిర , ధనిష్ఠ , శతభిషం, అశ్విని , రేవతి, నక్షత్రాలలో హెయిర్ కట్ చేయించుకుంటే శుభం అని విశ్వసిస్తారు..అలాగే మఖ , కృత్తిక , ఉత్తర, అనురాధ నక్షత్రాలు క్షురకర్మకు ప్రతికూలమైన నక్షత్రాలని.. ఈరోజుల్లో క్షవరం చేయించుకోవద్దని శాస్త్రం చెబుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version