కేసీఆర్ కుటుంబాన్ని ఉపేక్షిస్తే తెలంగాణ సర్వనాశనమే: బండి సంజయ్ !

-

రెండు రోజుల క్రితం తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కేసీఆర్ మరియు కేటీఆర్ లను నోటికొచ్చినల్టు మాట్లాడడంతో … కేటీఆర్ కూడా తనకు కౌంటర్ ఇచ్చాడు మరియు ఈ వ్యాఖ్యలు చేసినందుకు గాను బండి సంజయ్ కు పరువు నష్టం ద్వావా వేస్తూ నోటీసులను పంపాడు. అయితే ఈ విషయంపై బండి సంజయ్ కేటీఆర్ పైన తన డైన రీతిలో రెచ్చిపోయారు. పరువు అన్నది లేని వాళ్ళు కూడా నాపై పరువు నష్టం దావా వేస్తారా అంటూ చమత్కారంగా మాట్లాడారు. తెలంగాణాలో కేసీఆర్ ఫామిలీ మొత్తం ఏ ఒక్క దందాను కూడా వదిలిపెట్టదు అంటూ ఉదాహారణలతో సహా చెప్పాడు.

కవిత లిక్కర్ కేసులో ఇరుక్కుంటే, ఇంకొకరు ఏమో డ్రగ్స్ లో మునిగితేలుతున్నాడు అంటూ బండి సంజయ్ దుయ్యబట్టారు. ఇక మిగిలిన కేటీఆర్ ఏమో పరువునష్టం దావా అంటూ మరో కొత్త రకం దందాకు తెరలేపాడు. ఈ కుటుంబానికి ఇంకోసారి అవకాశం ఇస్తే తెలంగాణను పూర్తిగా నాశనం చేస్తారు అంటూ మాట్లాడారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version