వైసీపీ హయాంలో స్టీల్ ప్లాంట్ సమస్య గుర్తురాలేదా? : మాజీ ఎంపీ జీవీఎల్

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి స్వర్ణయుగం మొదలైందని, ఎన్టీయే కూటమిలో భాగస్వామ్యం అయినందున శరవేగంగా రాష్ట్రాభివృద్ధి జరుగుతుందని బీజేపీ మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న వైసీపీ నేతలు.. మీ ప్రభుత్వ హయాంలో స్టీల్ ప్లాంట్ సమస్య గుర్తుకు రాలేదా? అని ప్రశ్నించారు.

ఈ విషయంలో వైసీపీ నేతలు తమను తాము ఆత్మ విమర్శ చేసుకోవాలని సూచించారు.కక్షపూరిత రాజకీయాలతో రాష్ట్ర అభివృద్ధి పక్కదారి పడుతుందని, తాము రాజకీయాలకు అతీతంగా ఏపీ అభివృద్ధికి కృషి చేస్తున్నామని వెల్లడించారు. కాగా,ఆదివారం ఏపీలో పర్యటించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే.వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా రూ.10వేల కోట్లకు పైగా గ్రాంట్‌ను కేంద్రం ప్రకటించింది.

Read more RELATED
Recommended to you

Latest news