అమెరికాలో కాల్పులు.. హైదరాబాద్ యువకుడు దుర్మరణం

-

అమెరికాలో మరోసారి కాల్పులు చోటుచేసుకున్నాయి. ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో హైదరాబాద్‌కు చెందిన ఓ యువకుడు దుర్మరణం పాలయ్యాడు. మృతుడు చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆర్కేపురం డివిజన్ గ్రీన్ హిల్స్ కాలనీ రోడ్ నెంబర్- 2లో నివాసం ఉంటున్న కొయ్యడ చంద్రమౌళి కుమారుడు రవితేజగా గుర్తించారు.

ఇదిలాఉండగా, 2022 మార్చిలో అమెరికా వెళ్లిన రవితేజ మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసి ప్రస్తుతం ఉద్యోగం అన్వేషణలో ఉన్నాడు. ఈ క్రమంలోనే అమెరికా వాషింగ్టన్ ఏవ్‌లో దుండగులు జరిపిన కాల్పుల్లో రవితేజ మరణించాడు. తమ కుమారుడు చనిపోయాడని విషయం తెలియడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. గ్రీన్ హిల్స్ కాలనీలోని అతని నివాసం వద్ద విషాద ఛాయలు అలుముకున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news