మీకు పెళ్ళి కావడం లేదా? పిల్లలు పుట్టలేదా?ఈ క్షేత్రాలను దర్శించాలి..

-

మనుషుల పై గ్రహ దోషాలు ఎంతగా ప్రభావాన్ని చూపిస్తాయో ప్రత్యెకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఏదైనా దోషం ఉందంటే మనం అనుకున్న పనులు జరగక పోవడం,జరుగుతున్న పనులు మధ్యలోనే ఆగి పోవడం జరుగుతుంది.అంతే కాదు..కొందరికి ఎన్ని సంబంధాలు చూసిన కూడా పెళ్ళి కుదరదు. మరికొంతమందికి సంతాన యోగం ఉండదు.అలాంటి సమస్యలతో భాధ పడుతున్న వాళ్ళు కొన్ని దేవాలయాలను సందర్షించాలి అంటున్నారు..ఆ ప్రముఖ దేవాలయాలు, అవి ఎక్కడ ఉన్నాయో తెలుసుకుందాం..

ఏదైనా దోషాలు ఉన్నట్లయితే అందుకు నివారణ పూజ చేయించుకోవాలి.అప్పుడు చాలా నిష్టతో చేయాలనీ జ్యోతిష్కులు చెబుతున్నారు..వేకువ జామున దేవతలు భూమ్మీద సంచరిస్తారు అని అంటారు. అలాంటి సమయంలో మనం శ్రద్దగా చేసే పూజ వారికి నచ్చినట్లయితే మన కోరిక నెరవేరుతుందని పెద్దలు అంటున్నారు. దేవతల అనుగ్రహం మన మీద ఉండాలంటే..తెల్లవారు జామున పుణ్యస్నానం చేసి తడిబట్టలతో సుబ్రహ్మణ్య ఆలయానికి 70 ప్రదక్షిణాలను భార్యాభర్తలు 7 ఆదివారాలు చేసినట్లయితే సంతానలేమి సమస్య పరిష్కారమవుతుందని అందరు నమ్ముతున్నారు..

కృష్ణాజిల్లాలోని మోపిదేవి క్షేత్రంలో వెండి నాగప్రతిమలను దానము చేసినట్లయితే దోష పరిహారం జరుగుతుందనే విశ్వాసం వుంది. అలాగే 70 సార్లు కుజ శ్లోక పారాయణం చేయడం వల్ల సమస్యల నుంచి బయట పడతారు.కుజ, రాహు, కేతు గ్రహాలకు విడివిడిగా గ్రహ జపాలు చేయించి దానం చేస్తే వివాహం ఆలస్యం కావడం అనేది పరిష్కారమవుతుంది..పిల్లలు లేని సమస్య కూడా తీరుతుందని,కుటుంబంలో ఏదైనా చికాకులు, ఇంకేదైనా సమస్యలు ఉంటే అవి తొలగి పోతాయని పండితులు చెబుతున్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version