ప్రస్తుత రోజుల్లో ప్రతి ఇంట్లో నడుస్తున్న ముఖ్యమైన ముచ్చట్లో కార్తీక దీపం తప్పని సరిగా ఉంటుంది. ఈ కార్తీక దీపం సీరియల్ గత కొద్ది సంవత్సరాలుగా తెలుగు ప్రేక్షకుల ఇంట్లోకి బంధువులా చేరి మరీ ఉంది. అందుకు కారణం.. వంటలక్క, డాక్టర్ బాబు అనే చెప్పాలి. వీరి ఎమోషన్స్, నటన సీరియల్ కు హైలెట్ గా నిలుస్తున్నాయి. అలాంటిది.. ఈ సీరియల్ లో వంటలక్కను, డాక్టర్ బాబును చంపేశారు. దీంతో కార్తీక దీపం సీరియల్ అభిమానులు డైరెక్టర్ కాపుగంటి రాజేంద్రపై మండి పడుతున్నారు. ముఖ్యంగా భర్తలు ఈ డైరెక్టర్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు ఈ సీరియల్ ను చూసిన తమ భార్యలు.. ఇప్పుడు వంటలక్క, డాక్టర్ బాబు లేరు అంటూ.. ఏడుస్తున్నారని భర్తలు మొర పెట్టుకుంటున్నారు.
అయితే వంటలక్క ను డాక్టర్ బాబు ఈ సీరియల్ లో రోడ్డు ప్రమాదంలో చనిపోయినట్టు చిత్రికరించారు. కాగ ఈ సీరియల్ లో డాక్టర్ బాబును చంపేయడానికి బలమైన కారణం ఉందని తెలుస్తుంది. కార్తీక దీపం సీరియల్ లో డాక్టర్ బాబుగా నటిస్తున్న నిరుపమ్ ఈ సీరియల్ నుంచి పూర్తిగా తప్పుకున్నాడని తెలుస్తుంది. అందుకే ఆయన పాత్రను చంపేసినట్టు సమాచారం. డాక్టర్ బాబు పాత్రలో నటించే నిరుపమ్ తప్పుకోవడంతో వంటలక్క పాత్రలో నటించే ప్రేమి విశ్వనాథ్ కూడా తప్పుకుందని తెలుస్తుంది. కార్తీక దీపం సీరియల్ లో ప్రధాన పాత్రలు తప్పుకున్నా.. పిల్లలుగా ఉన్నా.. హీమా, సౌర్య పాత్రల తోనే ఈ సీరియల్ ను కొనసాగిస్తున్నట్టు తెలుస్తుంది.
దీంతో ఇప్పటికే దాదాపు 1000 ఎపిసోడ్స్ వరకు వచ్చిన కార్తీక దీపం సీరియల్.. తర్వాతి జనరేషన్ తో నడిపిస్తున్నారా అంటూ అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. అలాగే ఈ సీరియల్ డైరెక్టర్ కాపుగంటి రాజేంద్ర ఆలోచనకు సలాం చేస్తున్నారు. అలాగే ఈ సీరియల్ నుంచి డాక్టర్ బాబును వంటలక్కను తొలగిస్తే.. కథ సమాప్తం అవుతుందని అభిమానులు అంటున్నారు. అంతే కాకుండా వీరిని తొలగించినందుకు మీమ్స్ కూడా చేస్తున్నారు.