జగన్‌ ఇంట్లో ద్రౌపది ముర్ము తేనేటి విందు..

-

ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము.. ఏపీ పర్యటనలో ఉన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె మంగళవారం మధ్యాహ్నం ఏపీకి విచ్చేశారు. అనంతరం ద్రౌపది ముర్ము.. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్‌ సెంటర్‌లో వైఎస్సార్‌సీపీ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము తెలుగులో ప్రసంగం ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. వారసత్వ కట్టడాలకు ఆంధ్రప్రదేశ్‌ నిలయం. ఆంధ్రప్రదేశ్‌కు ఘనమైన చరిత్ర ఉంది.

ఎందరో మహనీయులు తెలుగు గడ్డపై జన్మించారు. ఈక్రమంలో తెలుగు కవులైన నన్నయ్య, తిక్కన, ఎర్రప్రగడలను ముర్ము స్మరించుకున్నారు. అయితే ఈ సమావేశం అనంతరం ఆమె ముఖ్యమంత్రి నివాసంలో సీఎం వైయస్‌.జగన్‌ను కలిసి… తేనీటి విందులో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలోనే.. ద్రౌపది ముర్ముకు వేదఆశీర్వచనం ఇచ్చి, ప్రసాదాలు అందించారు దుర్గామల్లేశ్వరస్వామి దేవస్ధానం వేదపండితులు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి, వైయస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి విజయసాయిరెడ్డి ఉన్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version