టిపిసిసి అధ్యక్ష పదవి దక్కలేదని చెప్పి…సొంత కాంగ్రెస్ పార్టీపై కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏ స్థాయిలో విమర్శలు చేశారో చెప్పాల్సిన పని లేదు…పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి..రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్యం ఠాకూర్ పై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. కొన్ని రోజుల పాటు కాంగ్రెస్ కు దూరమయ్యారు…అలాగే గాంధీ భవన్ గడప కూడా తొక్కనని అన్నారు.
ఇప్పుడు మరింత దూకుడుతో కోమటిరెడ్డి రాజకీయం చేస్తున్నారు..టీఆర్ఎస్, బీజేపీలపై ఫైర్ అవుతున్నారు..దమ్ముంటే కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు రావాలని సవాల్ విసురుతున్నారు. అలాగే తమ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని ఇబ్బంది పెడితే…వారి అంతు చూస్తా అనే రేంజ్ లో మాట్లాడుతున్నారు. కార్యకర్తలు మీద చేయి వేస్తే నరికేస్తా అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుందని మాట్లాడుతున్న ఆయన…బీజేపీకి తెలంగాణలో అంత సీన్ లేదని, ఆ పార్టీకి గ్రామ స్థాయిలో కార్యకర్తలు లేరని అంటున్నారు.
అంటే ఇప్పుడు కోమటిరెడ్డి రాజకీయం పూర్తిగా మారినట్లు కనబడుతోంది…కాంగ్రెస్ లో దూకుడుగా పనిచేస్తూ..టీఆర్ఎస్, బీజేపీలపై ఫైర్ అవుతున్నారు. అసలు బీజేపీకి గ్రామ స్థాయిలో కేడర్ లేదని అంటున్నారంటే..ఇంకా కోమటిరెడ్డి ఆ పార్టీలోకి వెళ్ళే అవకాశాలే లేవని కాంగ్రెస్ శ్రేణులు అంటున్నాయి..ఇంకా కోమటిరెడ్డి కాంగ్రెస్ లోనే ఉంటారని, రానున్న రోజుల్లో ఇంకా యాక్టివ్ గా పనిచేస్తారని తెలుస్తోంది. మొత్తానికైతే కోమటిరెడ్డి కాంగ్రెస్ పార్టీని వదలరని అర్ధమవుతుంది.