2024 టీ20 వరల్డ్ కప్ తో భారత ప్రధాన కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ముగిసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత జట్టు కోచ్‌గా గౌతమ్ గంభీర్ పేరు దాదాపు ఖారారైనట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం ఐపీఎల్ లో కోల్‌కతా నైట్ రైడర్స్ మెంటార్‌గా గంభీర్ వ్యవహరిస్తున్నాడు. గంభీర్ టీమ్ఇండియా ప్రధాన కోచ్‌గా రావడం ఖాయం కావడంతో కోల్‌కతా కొత్త మెంటార్‌ను నియమించుకునే పనిలో పడింది. కేకేఆర్‌కు మెంటార్‌గా ఉండాలని ద్రవిడ్‌ను ఫ్రాంఛైజీ సంప్రదించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 2024 ఐపీఎల్ సీజన్ ప్రారంభానికి ముందు కోల్‌కతా నైట్ రైడర్స్ మెంటార్‌గా గంభీర్ నియమితులయ్యారు.
సహా యజమాని అయిన షారుక్ ఖాన్ అతనికి 10 సంవత్సరాల అగ్రిమెంట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. కానీ.. బీసీసీఐ నుంచి పిలుపు రావడంతో గంభీర్ అటు మెగ్గు చూపినట్లు తెలుస్తోంది. గంభీర్ వెళ్లిపోతాడని గ్రహించిన కోల్‌కతా నైట్ రైడర్స్ ఫ్రాంఛైజీ ద్రవిడ్ పేరును షార్ట్ లిస్ట్‌లో ఉంచినట్లు తెలుస్తోంది.