మద్యం బాధితులపై తెలంగాణా కీలక నిర్ణయం; మద్యం షాపులపై స్పష్టత…!

-

తెలంగాణాలో కరోనా పుణ్యమా అని లాక్ డౌన్ ని అక్కడి ప్రభుత్వం కఠినంగా అమలు చేస్తుంది. తెలంగాణాలో కరోనా పెరగకుండా చాలా జాగ్రత్తగా చర్యలు తీసుకుంటుంది అక్కడి ప్రభుత్వం. ఈ క్రమంలోనే మద్యం షాపులను పూర్తిగా మూసి వేస్తూ నిర్ణయం తీసుకుంది. దీనితో అక్కడి మందు బాబుల్లో అసహనం వ్యక్తమవుతుంది. ఇన్నాళ్ళు సైలెంట్ గా ఉన్న మందు బాబులకు ఇప్పుడు మానసిక సమస్యలు వస్తున్నాయి.

రోజు పదుల సంఖ్యలో హైదరాబాద్ లోని ఎర్రగడ్డ ఆస్పత్రికి క్యూ కడుతున్నారు మానసిక అనారోగ్యం తో. దీనిపై ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఉమా శంకర్‌ మాట్లాడుతూ సాధారణ రోజుల్లో రోజుకు 30 నుంచి 40 కేసులు వచ్చేవని… అందులో 4 కేసులు మాత్రమే మద్యం కేసులు ఉండేవని వివరించారు. సోమవారం ఒక్క రోజే వందకు పైగా ఇలాంటి కేసులు నమోదు అయ్యేవని ఆయన మీడియాకు తెలిపారు.

లాక్‌డౌన్‌ నేపధ్యంలో రోగులు సంఖ్య పెరుగుతోందన్నారు. ప్రతి రోజూ మద్యం, కల్లు తాగడం వల్ల ఒక్క సారిగా వారికి తాగడానికి దొరక్క పోవడంతో వారి ప్రవర్తనలో మార్పు వచ్చిందని ఆయన వివరించారు. ఎక్కువగా క్లోరోఫామ్‌, డైజీఫామ్‌ వాడడం వల్ల ఇలా ప్రవర్తిస్తున్నారని ఆయన అన్నారు. మందు దొరక్క పోవడం వల్ల ఇది వారిలో 24 గంటల్లోనే ప్రభావం చూపుతుందని, వచ్చిన వారిని అడ్మిట్ చేసుకుంటున్నామని తెలిపారు.

ఈ నేపధ్యంలో తెలంగాణా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో ఈ పరిస్థితిపై అధికారులు చర్చలు జరిపారు. మద్యం దొరక్కపోవడంతో పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తున్న వారి వివరాలను సేకరించాలని ఎక్సైజ్ ఎస్సై, సీఐలను మంత్రి ఆదేశాలు ఇచ్చారు. అవసరమైన వారికి డిఅడిక్షన్ సెంటర్లలో చికిత్స అందజేయాలని, యోగ వంటి ఆసనాలు, యోగా, ధ్యానం, ఆధ్యాత్మికం వైపు మనసును మళ్లించేలా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. లాక్‌డౌన్ సమయంలో అన్ని రకాల మద్యం దుకాణాలు మూసివేసి ఉంటాయని మంత్రి స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version