మందుబాబుల ‘ డెడికేషన్’ చూసి ఆశ్చర్యపోయారు … !

-

కరోనా వైరస్ ప్రభావంతో దేశం మొత్తం షట్ డౌన్ అయిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా మందు షాపులు మొత్తం క్లోజ్ అయిపోయాయి. అయితే ఇటీవల కేంద్రం మూడో దశ లాక్ డౌన్ పొడిగించడం తో  కొన్నిటికి మినహాయింపు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో మందు షాపులు ఓపెన్ అయ్యాయి. ఒక్కసారిగా మందు అలవాటుపడిన ప్రాణానికి మందు షాపు ఓపెన్ అయినట్లు వార్తలు రావడంతో మందుబాబుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు కంటే మందు బాబులు దుకాణాల ముందు చేస్తున్న వింత చేష్టల గురించి వార్తలు ఎక్కువగా వస్తున్నాయి. ఒకపక్క వడగళ్ల వాన వచ్చిన గాని చాలా డెడికేషన్ తో సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ మందు కోసం క్యూలో కిలోమీటర్ల మేర నిలబడుతున్నారు. చాలా వరకు సామాన్య మనుషులకంటే మందుబాబులు సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ వ్యవహరిస్తున్న తీరు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఉత్తరాఖండ్ లోని నైనిటాల్ లో తాజాగా చోటు చేసుకున్న ఓ ఉదంతం సంచలనంగా మారటమే కాదు.. వాట్సాప్ లో విపరీతంగా వైరల్ గా మారి షేర్ అవుతోంది. నైనిటాల్ లోని ఒక వైన్ షాపు బయట మందుబాబులు నిలుచున్నారు.

 

వారికి కేటాయించిన సర్కిల్స్ లోనే. ఈ లోపు జోరు వర్షం స్టార్ట్ అయింది. వచ్చిన జోరు వానకు తడవకుండా ఉండేందుకు గొడగుల్ని రక్షగా పెట్టుకున్నారు. ఒక పక్క వర్షం జోరుగా కురుస్తున్న గాని వడగళ్ళు పడుతున్న గాని క్యూలో నిలబడిన వాళ్ళు అదరలేదు, బెదరలేదు. షాపు యజమాని ఇదంతా చూసి ఆశ్చర్యపోయాడు. వడగండ్ల వర్షం లో కూడా మందుబాబులు చూపించిన తెగువ, ప్రదర్శించిన డెడికేషన్ చూసి చుట్టుప్రక్కల ప్రాంతాల ప్రజలు కూడా ఆశ్చర్యపోయారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version