మద్యపానం ఆరోగ్యానికి హానికరం..అందానికి కాదు..వైన్‌తో ముఖంపై ముడతలు మాయం..!

-

ఇప్పుడున్న జీవనశైలి వల్ల ముప్పై దాటకముందే ముఖంపై ముడతలు వచ్చేస్తున్నాయి.. మరీ యవ్వన ప్రాయంలో ఉన్నప్పుడే ముఖంపై ఇలా ఫోల్డ్స్‌ రావడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. వీటి నుంచి తప్పించుకునేందుకు ఏవేవో ప్రయత్నాలు చేస్తుంటారు. కొందరికి అయితే అసలు అందంపై శ్రద్ధే ఉండదు. ఇష్టం వచ్చింది తినడం, లేటుగా పడుకోవడం అన్‌హెల్తీ లైఫ్‌స్టైల్‌ను పాటించేసి..అడ్డదిడ్డంగా తయారవుతున్నారు. వారిగురించి వదిలేయండి..మీకు ఈ విషయం తెలుసా..!! ఆల్కాహాల్ (Alcohol)​తో మీ అందాన్ని మెరుగు పరచుకోవచ్చంట. వోడ్కా, వైన్ వంటివి సౌందర్యాన్ని పెంచుతాయట.. మద్యపానం ఆరోగ్యానికి హానికారం..అందానికి కాదంటున్నారు సౌందర్య నిపుణులు.. మరి ఎలాగో చూద్దామా..!

రెడ్ వైన్ యాంటీ ఆక్సిడెంట్‌లను పుష్కలంగా కలిగి ఉంటుంది. ముఖంపై దీనిని అప్లై చేయటం వలన నల్లటి వలయాలు, ముడుతలు తొలగిపోతాయి. అంతేకాకుండా, రెడ్ వైన్‌కు కొద్దిగా తేనె కలిపి ముఖానికి అప్లై చేసి, 10 నుండి 15 నిమిషాల పాటూ ఉంచటం వలన చర్మం తాజాగా అవుతుంది..

సగం బాటిల్ బీర్‌ను గోరువెచ్చని నీటిలో కలిపి కాళ్ళను 20 నిమిషాల పాటూ ముంచండి. బీర్ సహజ యాంటీ సెప్టిక్ వలే పని చేసి, కాలి గోర్లను శుభ్రపరుస్తుంది. దీనితో పాటుగా బీర్ పాదాలను మృదువుగా (smooth) మారుస్తుందట.. ఉప్పు, ఆలివ్ ఆయిల్, కొద్దిగా నిమ్మరసం కలిపిన మిశ్రమాన్ని చర్మంపై వలయాకారంలో రుద్దండి. ఇది మీ శరీరంపై ఉండే నిర్జీవ కణాలను తొలగించి, చర్మాన్ని మృదువుగా చేస్తుంది. ఈ మిశ్రమంతో చర్మంపై రుద్దిన తరువాత 5 నిమిషాల పాటూ అలాగే ఉంచి, నీటితో చర్మాన్ని కడగండి. అంతేకాదండోయ్​ ఈ మద్యంను దాలకు వాడితే నొప్పులు కూడా మటుమాయం అవుతాయంట.

బయట ఎక్కువగా తిరగటం వలన వెంట్రుకలు పొడిగా, అనారోగ్యానికి గురవుతాయి. ఇలాంటి సమయంలో జుట్టును షాంపూతో కడిగిన తరువాత తేలిక పాటి గాడత గల బీర్‌లో ముంచండి. ఇలా చేయటం వలన మీ జుట్టు మృదువుగా మారటమే కాకుండా, తలపై చర్మ ఆరోగ్యంకూడా మెరుగుపడుతుందట..

ఇలా మద్యంతో ఇన్ని బ్యూటీ టిప్స్‌ ట్రై చేసేయొచ్చు.. వైన్‌ స్కిన్‌కు చాలా బాగా ఉపయోగపడుతుందని ఇప్పటికే ఎన్నో అధ్యయనాలు ప్రూవ్‌ చేశాయి.. కాబట్టి మద్యాన్ని తాగి ఆరోగ్యం పాడుచేసుకోకుండా..ఇలా వాడేసి అందాన్ని పెంచేసుకోండి మరీ..!

Read more RELATED
Recommended to you

Exit mobile version