ఇటీవలి కాలంలో ప్రభుత్వ ఉద్యోగులు అవినీతికి పాల్పడుతూ అడ్డంగా బుక్కవుతున్నారు. తాజాగా విశాఖపట్నం జిల్లా వాల్తేరు రైల్వే డివిజన్ డీఆర్ఎంగా పనిచేస్తున్న సౌరభ్ అవినీతి కేసులో పట్టుబడ్డాడు. ముంబైలో లంచం తీసుకుంటుండగా ముందస్తు సమాచారం మేరకు సీబీఐ అధికారులు పట్టుకున్నారు.ఓ కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకునేందుకు సౌరభ్ ప్రసాద్ ముంబైకి వెళ్లినట్లు సమాచారం.
ఈ విషయాన్ని ముందుగానే సీబీఐకి సదరు కాంట్రాక్టర్ అందించినట్లు తెలుస్తోంది.దీంతో సౌరభ్ కుమార్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకునేందుకు ప్లాన్ చేశారు అధికారులు.ఈ క్రమంలోనే సౌరభ్ కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటుండగా అతన్ని పట్టుకున్నారు. అనంతరం విశాఖలోని డీఆర్ఎం కార్యాలయంలోనూ సీబీఐ అధికారులు సోదాలు జరిపారు. కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు.సౌరభ్ కుమార్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు సీబీఐ అధికారులు తెలిపారు.