భారత్, పాక్ సరిహద్దుల్లో డ్రోన్ కలకలం, ఎక్కడి నుంచి వచ్చింది…?

-

జమ్మూ కాశ్మీర్‌ లోని ఆర్‌ఎస్ పురా సెక్టార్‌ లోని అంతర్జాతీయ సరిహద్దు వద్ద శనివారం రాత్రి పాకిస్తాన్ నుంచి వచ్చిన డ్రోన్‌ను ఎగురుతున్నట్లు సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్) ఆదివారం తెలిపింది. ఆర్నియా ప్రాంతంలోని అంతర్జాతీయ సరిహద్దు వద్ద ఈ డ్రోన్‌ ను గుర్తించారు. తన భద్రతా సిబ్బంది కాల్పులు జరిపిన తరువాత పాకిస్తాన్ కు తిరిగి వెళ్లిందని బిఎస్ఎఫ్ తెలిపింది.

“జమ్మూ కాశ్మీర్‌ లోని ఆర్ఎస్ పురా సెక్టార్‌లోని ఆర్నియా ప్రాంతంలోని అంతర్జాతీయ సరిహద్దు వద్ద నిన్న రాత్రి ఒక డ్రోన్ కనిపించింది. బిఎస్‌ఎఫ్ దళాలు దానిపై కాల్పులు జరిపిన తరువాత పాకిస్తాన్ వైపు తిరిగి వెళ్ళింది” అని బిఎస్ఎఫ్ తెలిపింది. ఒక వారం క్రితం, జమ్మూ కాశ్మీర్‌లోని పూచ్ జిల్లాలోని మేంధర్ సెక్టార్‌లోని లైన్ ఆఫ్ కంట్రోల్ (ఎల్‌ఓసి) సమీపంలో ఎగిరే వస్తువు కనిపించింది. ఈ వస్తువు భారత భూభాగంపై ఎగురుతూ కనిపించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version