చుక్క‌లు చూపిస్తున్న మున‌గ‌కాయ‌లు ధ‌ర‌లు..కిలో రూ.600

-

మ‌న దేశంలో… పెట్రోల్‌, వంట గ్యాస్‌, వంట నూనెల తో స‌హా కూర‌గాయ‌ల ధ‌ర‌లు.. సామాన్య ప్ర‌జ‌ల‌కు చుక్క‌లు చూపిస్తున్నాయి. మొన్న‌టి వ‌ర‌కు టామోటో ధ‌ర‌లు రూ.150 చేరుకోగా.. ఇప్పుడు ఇత‌ర కూర‌గాయ‌లు కూడా అదే దారి పడుతున్నాయి. అయితే.. తాజాగా…  చిత్తూరు జిల్లా మదనపల్లే కూరగాయల మార్కెట్ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా శుక్రవారం మునగకాయలు కిలో ధర 600 రూపాయలు పెరిగింది.

కిలోకి 12 నుంచి 18 వేల రూపాయలు తుగూతాయి. వీలైతే ఒక్కొక్కడికి 30 రూపాయల పైన పలికింది. గత మాసంలో కురిసిన భారీ వర్షాలకు మదనపల్లె పరిసర ప్రాంతాల్లో మునగ చెట్లూ పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో తమిళనాడు రాష్ట్రం నుంచి మునగకాయలు దిగుమతి అవుతున్నాయి. వంగ, బీర, కాకర, బీన్స్, ముల్లంగి తదితర కూరగాయలు మార్కెట్లో కిలో 80 రూపాయల నుంచి 180 రూపాయలు పలుకుతున్నాయి. దీంతో సామాన్య ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. ఎంత రేటు సమితి తమ జీవనం ఎలా గడుస్తుంది అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రజలు. దీనిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version