నాంపల్లి కోర్టులో హాజరుకావడంపై ట్విస్ట్ ఇచ్చారు అల్లు అర్జున్. నాంపల్లి కోర్టులో వర్చువల్ గా హాజరుకానున్నారు అల్లు అర్జున్. అంటే… ఆన్ లైన్ ద్వారానే… నాంపల్లి కోర్టులో జరిగే విచారణకు హాజరు కానున్నారు అల్లు అర్జున్. శాంతి భద్రతల నేపథ్యంలో అల్లు అర్జున్ వర్చువల్ గా హాజరు అవుతారని కోర్టును కోరారు న్యాయవాదులు.
అయితే.. దీనికి కోర్టు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ తరుణంలోనే… నాంపల్లి కోర్టులో వర్చువల్ గా హాజరుకానున్నారు అల్లు అర్జున్. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో విచారణ ఎదుర్కొంటున్న సినీ నటుడు అల్లు అర్జున్ మరికాసేపట్లో నాంపల్లి కోర్టు ముందు వర్చువల్ గా హాజరుకానున్నారు. ఈ కేసును ఏసీపీ రమేష్ కుమార్ తో పాటు సెంట్రల్ జోన్ డీసీపీలు విచారిస్తున్నారు. ఈ కేసులో బన్నీ A11 ముద్దాయిగా ఉన్న సంగతి తెలిసిందే.