ఏపీలోని గుంటూరు జిల్లా బాపట్లలో విద్యార్థులు మత్తుకు బానిసయ్యారు. డ్రగ్స్, మత్తు ఇంజెక్షన్లను తరచూగా తీసుకుంటున్నట్లు బాధిత పేరేంట్స్, స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాపట్ల పట్టణంలో రోజు రోజుకు డ్రగ్స్‌కు అలవాటు పడుతున్న యువకులు సంఖ్య క్రమంగా పెరిగిపోతున్నదని సమాచారం.
పిల్లలు కళ్ల ముందే చెడిపోతున్నారని, మత్తు నుంచి బయటకు రావడం లేదని పేరెంట్స్ వాపోతున్నారు.పోలీసులు, ఎక్సైజ్, డ్రగ్స్ అధికారులు మత్తు పదార్థాలు సరఫరా చేసేవారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు, పేరెంట్స్ డిమాండ్ చేస్తున్నారు. కాగా, మత్తుకు బానిసైన యువకులు స్థానికంగా అశాంతిని క్రియేట్ చేస్తున్నారని సమాచారం.