మిర్చి పంటకు నిప్పు.. 50 క్వింటాళ్లు దగ్ధం

-

ఏపీలోని పల్నాడు జిల్లాలో గుర్తు తెలియని దుండగులు మిర్చి పంటకు నిప్పంటించారు. జిల్లాలోని కారంపూడి మండలం లక్ష్మీపురంలో వజ్రాల సురేష్ రెడ్డి అనే రైతుకు చెందిన మిర్చి పంటకు నిప్పంటించినట్లు తెలిసింది.

ఈ ఘటనలో 50 క్వింటాళ్ల మిర్చి మంటల్లో దగ్ధమైంది. కాగా, రూ. 6 లక్షల వరకు నష్టం జరిగిందని బాధితు రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. తనకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని సదరు రైతు వేడుకుంటున్నాడు. కాగా, ఈ ఘటన మీద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news