గుజరాత్ తీరం వద్ద రూ. 400 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..

-

దేశంలో ఎన్ని పకడ్భందీ చర్యలు తీసుకున్నా ఏదో విధంగా డ్రగ్స్ రవాణా అవుతూనే  ఉన్నాయి. ముఖ్యంగా పాకిస్థాన్ నుంచి గుజరాత్, మహారాష్ట్ర తీరాలకు అరేబియా సముద్రం ద్వారా డ్రగ్స్ వస్తున్నాయి. ఇదిలా ఉంటే పంజాబ్ బోర్డర్స్ లో ఏకంగా డ్రోన్ల ద్వారా డ్రగ్స్ సరఫరా అవుతున్నాయి. ఇటీవల డ్రోన్ల ద్వారా డ్రగ్స్ తరలిస్తుండగా భద్రతా బలగాలకు పట్టుబడ్డాయి.

తాజాగా ఈరోజు గుజరాత్ తీరం వద్ద పెద్ద ఎత్తున డ్రగ్స్ పట్టుబడ్డాయి. పాకిస్థాన్ నుంచి గుజరాత్ తీరం వైపు వస్తున్న బోట్ లో పెద్ద ఎత్తున డ్రగ్స్ ను ఇండియాకు తరలిస్తున్నారు. గుజరాత్‌లో ఇండియన్ కోస్ట్ గార్డ్ మరియు గుజరాత్ ఏటీఎస్ జాయింట్ఆ పరేషన్‌లో 6 మంది సిబ్బందితో కూడిన పాకిస్తాన్ బోట్ ‘అల్ హుస్సేనీ’ పట్టుబడింది. పెట్రోలింగ్‌ చేస్తున్న సమయంలో గుజరాత్‌ తీరంలో పాకిస్థాన్‌కు చెందిన బోటు పట్టుబడింది. పడవలో ఉన్న మొత్తం 6 మంది అనుమానితులను అరెస్టు చేసి వారి నుంచి 77 కిలోల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు అధికారులు. ప్రస్తుతం పట్టుబడ్డ డ్రగ్స్ విలువ అంతర్జాతీయ మార్కెట్ ధర రూ.400 కోట్లుగా చెబుతున్నారు. ప్రస్తుతం అందరినీ విచారిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version