మేడ్చల్- దుండిగల్ పీఎస్ పరిధిలోని బహదూర్‌పల్లిలో గల అయోధ్య విల్లాస్‌లో తాగుబోతుల హల్చల్ చేశారు. తప్పతాగి విల్లాస్‌లో చొరబడి రోడ్లపై ఉన్న కార్ అద్దాలు ధ్వంసం చేయడంతో పాటు అడ్డుకోబోయిన సెక్యూరిటీని విచక్షణారహితంగా పిడిగుద్దులతో దాడికి పాల్పడ్డారు.
విల్లాస్‌లోని మహిళలపై దురుసుగా ప్రవర్తించినట్లు సమాచారం.ఈ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. నిందితులు సురారం కాలనీకి చెందిన అజయ్, నితిన్ లాలూ, తిరుమలేశ్ అనే యువకులుగా గుర్తించారు. ఈ మేరకు పోలీసులకు విల్లాస్ వారు ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.
మేడ్చల్ – దుండిగల్ పియస్ పరిదిలోని బహదూర్‌పల్లిలో గల అయోధ్య విల్లాస్‌లో తాగుబోతుల హల్చల్
తప్పతాగి విల్లాస్‌లో చొరబడి రోడ్లపై ఉన్న కార్ అద్దాలు ద్వంసం.. అడ్డుకోబోయిన సెక్యూరిటీని విచక్షణారహితంగా పిడిగుద్దులతో దాడి
విల్లాస్‌లో మహిళలపై దురుసు ప్రవర్తన
సీసీ కెమెరాల్లో రికార్డ్… pic.twitter.com/hysxzZJFak
— Telugu Scribe (@TeluguScribe) April 18, 2025